Father’s love: నాన్న ప్రేమ ఆకాశమంత.. కూతురు ఎదుగుదలను పదిలం చేసిన తండ్రి .. పసిపాప నుంచి అమ్మాయిగా టైమ్‌లాప్స్‌ వీడియో

తాజాగా తండ్రి తన కూతురుపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ.. 20 ఏళ్ల పాటు పడిన తపనకు చెందిన వీడియో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. ప్ర‌తిరోజూ త‌న కూతురి ఫోటోలు క్లిక్‌మ‌నిపించి టైమ్‌లాప్స్ వీడియో ప్ర‌జెంట్ చేశాడు ఓ తండ్రి.

Father's love: నాన్న ప్రేమ ఆకాశమంత.. కూతురు ఎదుగుదలను పదిలం చేసిన తండ్రి .. పసిపాప నుంచి అమ్మాయిగా టైమ్‌లాప్స్‌ వీడియో
Daughter And Father Love
Follow us
Surya Kala

|

Updated on: Nov 07, 2022 | 6:19 PM

కూతురిపై తండ్రి ప్రేమ‌కు హ‌ద్దులుండ‌వు. తండ్రి కూతుళ్ల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కూతుళ్లు తండ్రి మనసుకు చాలా దగ్గర. తన కూతుర్ని అమ్మకాని అమ్మగా ప్రతి తండ్రి భావిస్తాడు. పుట్టినపట్టి నుంచి మరో ఇంటికి కోడలుగా అడుగు పెట్టేవరకూ అల్లారుముద్దుగా అరచేతుల్లో పెట్టుకుని పెంచుతాడు తండ్రి.. అసలు కూతురుపై తండ్రి ప్రేమ గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది ఉందేమో అనిపిస్తుంది కూడా.. ఇప్పటికే తండ్రి కూతుర్ల ప్రేమకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా తండ్రి తన కూతురుపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ.. 20 ఏళ్ల పాటు పడిన తపనకు చెందిన వీడియో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. ప్ర‌తిరోజూ త‌న కూతురి ఫోటోలు క్లిక్‌మ‌నిపించి టైమ్‌లాప్స్ వీడియో ప్ర‌జెంట్ చేశాడు ఓ తండ్రి. ఈ వీడియోను రూపొందించిన డ‌చ్ డైరెక్ట‌ర్ ఫ్రాన్ హ‌ఫ్మిస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో హాట్ డిబేట్‌గా మారిపోయారు. 20 ఏళ్లుగా ఆయ‌న త‌న కూతురు లాటె ఫోటోలు తీసి భ‌ద్ర‌ప‌రిచాడు.

త‌న కూతురు సూప‌ర్ క్యూట్ బేబీగా ఉన్న‌ప్ప‌టి నుంచి 20 ఏళ్ల యువ‌తిగా మారే ప్ర‌క్రియ అంత‌టినీ ఫోటోల్లో నిక్షిప్తం చేశాడు. లాటె బేబీ నుంచి అంద‌మైన యువ‌తిలా మారే క్ర‌మంలో ఆమె అప్పియ‌రెన్స్ ఎలా మారింద‌నేందుకు అద్దం ప‌ట్టేలా రెండు నిమిషాల 18 సెకండ్ల వ్య‌వ‌ధి క‌లిగిన వీడియోను రూపొందించాడు.

ఇవి కూడా చదవండి

20 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కూ కూతురి ఫోటోలు తీసిన తండ్రి ఈ వీడియోను క్రియేట్ చేశార‌ని రెడిట్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. కూతురి ప‌ట్ల తండ్రికి ఉన్న మ‌మ‌కారం, అంకిత‌భావాన్ని ఈ వీడియో తెలియ‌చేస్తోంద‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేయ‌గా, కూతురికి తండ్రి ఇచ్చిన అద్భుత‌మైన గిఫ్ట్ ఇద‌ని మ‌రో యూజ‌ర్ రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..