Wedding Gift: వధువు వింత కండిషన్.. దెబ్బకు నివ్వెరపోయిన పెళ్లికొచ్చిన అతిధులు.. ఇంతకీ అదేంటంటే..

వివాహానికి హాజరు కావాలంటే.. అతిథులు తమతో పాటు 250 పౌండ్ల నగదు (మనదేశ కరెన్సీలో సుమారు రూ. 24,200) తీసుకురావాలని వధువు ఆహ్వానితులకు స్పష్టంగా చెప్పిందట పెళ్లికూతురు. అంతేకాదు.. ఇలా నగదుని గిఫ్ట్ గా ఇవ్వడం ఇష్టం లేనివారు తన పెళ్ళికి అసలు రావాల్సిన అవసరం లేదని వధువు హెచ్చరించింది.

Wedding Gift: వధువు వింత కండిషన్.. దెబ్బకు నివ్వెరపోయిన పెళ్లికొచ్చిన అతిధులు.. ఇంతకీ అదేంటంటే..
Wedding Gift
Follow us
Surya Kala

|

Updated on: Nov 07, 2022 | 5:50 PM

కొంతకాలం క్రితం వరకూ పెళ్లి చేసే సమయం.. వధూవరుల కుటుంబ సభ్యులు తమ పిల్లలు అడుగు పెట్టె కుటుంబంలో సుఖసంతోషాలతో జీవిస్తారా లేదా అని ఆలోచించేవారు.. అయితే కాలంతో వచ్చిన మార్పుల్లో భాగంగా పెళ్లిళ్లలు జరగాలంటే కట్నాలు, కానుకలు చేరాయి. ప్రస్తుత కాలంలో అయితే పెళ్లిళ్లు మరింత ఆప్ డేట్ అయ్యి.. అబ్బాయి జీతం ఎంత, ఆస్తులు ఎన్ని.. వంటివి చూసి.. అమ్మాయిలు ఓకే అంటుంటే.. అమ్మాయిలు ఎంత కట్నం ఇస్తారు.. కానుకలు ఎంత భారీగా సమర్పిస్తారు అని చూసుకుంటున్నారు పెళ్ళికొడుకు.. ఏది ఏమైనా పెళ్లితో ఒకటైన దంపతులు జీవితాంతం సుఖ సంతోషాలతో  జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ.. తమ స్థాయికి తగినట్లు కట్నకానులను సమర్పిస్తారు. అయితే పెళ్ళికి సంబంధించిన అద్భుతమైన కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రెడ్డిట్‌లో పెళ్ళిలో జరిగిన ఘటన ఒకటి వైరల్ అవుతోంది. ఓ పెళ్లికూతురు పెళ్లికి ముందే అతిథుల ముందు పెళ్లి మండపంలో పెట్టిన షరత్తు అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లికి హాజరు కావాలంటే అంత నగదు తీసుకురావాలని వధువు ఆహ్వానితులకు చెప్పింది. అంతేకాదు.. తన పెళ్ళికి కానుకగా నగదు తీసుకుని రాకపోతే.. వివాహానికి కూడా హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పేసింది పెళ్లికూతురు..

వధువు స్నేహితురాలు రెడ్డిట్‌లో ఈ పెళ్ళికి సంబంధించిన మొత్తం విషయాన్ని పంచుకున్నాది. తన స్నేహితురాలి చేసిన పనికి తాను చాలా  ఆశ్చర్యపోయినట్లు స్నేహితురాలు పేర్కొంది. వివాహానికి హాజరు కావాలంటే.. అతిథులు తమతో పాటు 250 పౌండ్ల నగదు (మనదేశ కరెన్సీలో సుమారు రూ. 24,200) తీసుకురావాలని వధువు ఆహ్వానితులకు స్పష్టంగా చెప్పిందట పెళ్లికూతురు. అంతేకాదు.. ఇలా నగదుని గిఫ్ట్ గా ఇవ్వడం ఇష్టం లేనివారు తన పెళ్ళికి అసలు రావాల్సిన అవసరం లేదని వధువు హెచ్చరించింది. స్నేహితులను కూడా వదలలేదు అంతే కాదు ఈ ‘అత్యాశ పెళ్లికూతురు’ స్నేహితులను కూడా వదలలేదు. తన ఫ్రెండ్స్ కు కూడా ఇదే షరతును విధించిందట. దీంతో ప్రస్తుతం ఈ పెళ్లికూతురు పై స్నేహితులు కోపంగా ఉన్నారని పేర్కొంది. రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన స్నేహితురాలు తన స్నేహితురాలి కోసం బహుమతిని కూడా కొన్నానని, అయితే బహుమతికి బదులుగా తనకు చాలా డబ్బు అవసరమని తన స్నేహితురాలు చెప్పింది. ఈ ఘటన బెల్జియన్ లో చోటుచేసుకుంది.  వధువు బెల్జియన్ కు చెందిన అమ్మాయి. అక్కడ ఆచారం ప్రకారం..  కొత్త జంటకు డబ్బును బహుమతిగా చుట్టాలు స్నేహితులు డబ్బులను మాత్రమే ఇస్తారు.. ఇలా వచ్చిన డబ్బులతో ఆ నవ దంపతులు కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు.

అయితే ఇప్పటి వరకూ ఏ పెళ్లికూతురు ఇలా వింత డిమాండ్ చేయలేదని అంటున్నారు. ఇది దోపిడీ లాంటిదని ప్రజలు అంటున్నారు. అతిథులను సంతోషపెట్టడానికి వధూవరుల కుటుంబ సభ్యలు పెళ్లిలో ఘనంగా విందు వినోదం వంటి ఏర్పాట్లు చేస్తారు.  అయితే ఇక్కడ వధువు చాలా అత్యాశకు పోయి.. తిరిగి అతిధులను డబ్బు రావాలని అడుగుతూ వార్తల్లో నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..