AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Girls Fighting: పొట్టు పొట్టు కొట్టుకుంటున్న అమ్మాయిలు.. విడదీయడానికి వెళ్లి.. తన్నులు తిన్న యువకుడు ఫన్నీ వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు అమ్మాయిల ఎదో విషయంపై గొడవ పడుతున్నారు. అటుగా వెళ్తోన్న వ్యక్తి.. ఆ ఇద్దరి అమ్మాయిల మధ్యకు వెళ్లి.. వారిని విడదీయాలను చూశాడు. ఆ యువతలకు గొడవ పడకుండా చేయాలని .. భావించి వెళ్లినందుకు ..

Girls Fighting: పొట్టు పొట్టు కొట్టుకుంటున్న అమ్మాయిలు.. విడదీయడానికి వెళ్లి.. తన్నులు తిన్న యువకుడు ఫన్నీ వీడియో వైరల్
Girls Fighting Video Viral
Surya Kala
|

Updated on: Nov 06, 2022 | 12:02 PM

Share

ఇద్దరు వ్యక్తుల మధ్య బేధాభిప్రాయాలు వచ్చి తరచుగా తగాదాలు ఏర్పడతాయి. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలతో కూడా ఒకరితో ఒకరు గొడవ పడుతుంటారు.. చినికి చినికి గాలివానైనట్లు.. చిన్న చిన్న వివాదాలే.. పెద్ద గొడవలకు దారితీయవచ్చు. కొన్నిసార్లు ఇలాంటి పోరాటాలు ప్రాణాంతకంగా కూడా మారతాయి. సాధారణంగా గ్రామాల్లో చిన్న చిన్న విషయాలకే ఒకరితో ఒకరు గొడవపడి.. నానా బీభత్సం సృష్టిస్తారు. ఇలాంటి పోరాటాలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఒకొక్కసారి ఆ వీడియోలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.. అయితే ఈ వీడియో కూడా చాలా ఫన్నీగా ఉంది. ఎందుకంటే ఇద్దరు గొడవ పడుతుంటే మధ్యలో వెళ్లి.. జోక్యం చేసుకుని గొడవను ఆపాలని చూసినందుకు తిరిగి తన్నులు తిన్నాడు.

వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు అమ్మాయిల ఎదో విషయంపై గొడవ పడుతున్నారు. అటుగా వెళ్తోన్న వ్యక్తి.. ఆ ఇద్దరి అమ్మాయిల మధ్యకు వెళ్లి.. వారిని విడదీయాలను చూశాడు. ఆ యువతలకు గొడవ పడకుండా చేయాలని .. భావించి వెళ్లినందుకు తిరిగి ఆ యువకుడు దెబ్బలు తిన్నాడు. ఒక అమ్మాయి ఏకంగా అతడిని నోటితో కొరికింది కూడా.. ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి ఒకరితో ఒకరు గొడవ పడుతుండటం వీడియోలో చూడవచ్చు. ప్రారంభంలో.. ఎదో  బాక్సింగ్ పోటీ జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ ఫైట్ లో జీన్స్ వేసుకున్న అమ్మాయి ట్రాక్ సూట్ వేసుకున్న అమ్మాయి కంటే కొంచెం హెవీగా కనిపిస్తోంది. వీరిద్దరి గొడవ మధ్యలో అటుగా వెళ్తున్న యువకుడు వెళ్ళాడు.. గొడవను ఆపడానికి ట్రై చేశాడు. దీంతో ఆ యువకుడిని నేలపై పడుకోబెట్టి, కొట్టడం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ ఫైట్ వీడియో @Baharikekalesh అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 19 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది ఈ వీడియోను లైక్ చేశారు.

అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ యువతి చాలా బలంగా ఉంది. ఇద్దరు యువతులు ఆ యువకుడిని కుమ్మేశారు.. అని మరొకరు.. ఆ యువతి ఇద్దర్ని ఏకకాలంలో భలే కొట్టింది అని ఇలా రకరకాల కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..