AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Video: స్నేహం అంటే ఈ కుక్కదే.. తన ఫ్రెండ్ పక్షి ప్రాణం కోసం పాముతో పోరాటం.. వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పాము పక్షుల బోనులోకి ప్రవేశిస్తోంది. ఆ బోనులో ఉన్న పక్షులను, వాటి గుడ్లను ఆహారంగా తీసుకోవాలని భావించినట్లు ఉన్నట్లుండి పాముకి.. అయితే పాము కోరికను ఓ పెంపుడు చిన్న కుక్క అడ్డుకట్ట వేసింది.

Dog Video: స్నేహం అంటే ఈ కుక్కదే.. తన ఫ్రెండ్ పక్షి ప్రాణం కోసం పాముతో పోరాటం.. వీడియో వైరల్
Dog Viral Video
Surya Kala
|

Updated on: Nov 05, 2022 | 5:27 PM

Share

కుక్కలు మనిషికి మంచి స్నేహితులు. కుక్కకు చిన్న బిస్కెట్ వేసినా చాలు.. ఎంతో కృతజ్ఞతగా ఉంటాయి. విశ్వాసాన్ని చూపిస్తాయి. అటువంటి కుక్కలను తమ ఇంట్లో మనుషుల్లా పెంచుకునే వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు.. వాటికీ బర్త్ డే వంటి వేడుకలను కూడా చేస్తారు. ఇక కుక్కలు కూడా తాము ఉన్న ఇంటిని, ఇంట్లోని వ్యక్తులను కాపలా కాస్తుంది. అపరిచిత వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకుండా రక్షణగా నిలబడుతుంది. కుక్కలు ఆత్మీయ స్నేహితులు. తమని నమ్మిన వారిని. తమకు ఆశ్రయం ఇచ్చిన వారికోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కాపాడిన ఘటనలు అనేకం చూడం.. వీడియోలు చూసాం కూడా… ప్రస్తుతం అదే తరహాలో ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు .

ప్రపంచంలోనే అత్యంత అందమైన బంధం స్నేహం అని అంటారు. తమ స్నేహితుడి కోసం తమ జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా వెనుకాడరు. ఇలా  మనుషులు మాత్రమే ఇలా చేస్తారని మీరు అనుకుంటే పొరపాటే.. జంతువులు, పక్షులు కూడా తమ స్నేహం కోసం ఎంతటి త్యాగం చేయడానికి కూడా వెనుకాడవు అని అంటారు.. ఈ వీడియో చూస్తే.. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ కుక్క తన స్నేహితుడైన చిలుక ప్రాణాన్ని కాపాడేందుకు.. తన ప్రాణాల గురించి పట్టించుకోకుండా ప్రమాదకరమైన పామును ఢీకొట్టింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పాము పక్షుల బోనులోకి ప్రవేశిస్తోంది. ఆ బోనులో ఉన్న పక్షులను, వాటి గుడ్లను ఆహారంగా తీసుకోవాలని భావించినట్లు ఉన్నట్లుండి పాముకి.. అయితే పాము కోరికను ఓ పెంపుడు చిన్న కుక్క అడ్డుకట్ట వేసింది. ఓ కుక్క తన స్నేహితుల ప్రాణాలను రక్షించడానికి అక్కడికి చేరుకుంది. కుక్క.. పాము తోక పట్టుకుని బోనులోంచి బయటకు లాగుతుంది. ఈ సమయంలో.. కుక్క తనను పాము కరిస్తే.. అన్న ఆలోచన చేయనట్లుంది. పాము తోకను పట్టుకుని పక్షి బోనుంచి బయటకు తీసి.. దానిని అక్కడ నుంచి బయటకు తీసుకుని వెళ్ళింది.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో  షేర్ చేసిన ఈ వీడియో క్లిప్  30 మిలియన్ల కంటే వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు మిలియన్ల మంది  లైక్ చేసారు.  వేలాది మంది దానిపై కామెంట్లు కూడా చేశారు. కుక్క దైర్యాన్నిఇష్టపడ్డారు. దాని స్నేహ నిరతిని విశ్వసాన్ని ప్రశంసల వర్షంతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..