Collector Divya S Iyer: పసిబిడ్డతో పబ్లిక్ ఫంక్షన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్.. మహిళా హక్కులపై సర్వత్రా చర్చ

లెక్టర్ దివ్య అయ్యర్ తన మూడున్నరేళ్ల కొడుకు మల్హర్‌ని అడూర్‌లో జరుగుతున్న ఆరవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకకు తీసుకుని వచ్చారు. అంతేకాదు..దివ్య అయ్యర్ చేతుల్లో బిడ్డ ఎత్తుకుని ప్రసంగించారు. అయితే కలెక్టర్ అయ్యర్ చేసిన పనిని కొందరు విమర్శిస్తే.. మరికొందరు అదే కదా అమ్మ మనసు అంటూ మద్దతు తెలుపుతున్నారు.

Collector Divya S Iyer: పసిబిడ్డతో పబ్లిక్ ఫంక్షన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్.. మహిళా హక్కులపై సర్వత్రా చర్చ
Collector Divya S Iyer with her son
Follow us
Surya Kala

|

Updated on: Nov 05, 2022 | 3:04 PM

మానవజాతి మనుగడకే ప్రాణం పోసేది మహిళ. తల్లి, చెల్లి, సోదరి, ఇంట్లో ఇల్లాలిగా తన భాద్యతలను నిర్వహిస్తూనే.. ఉద్యోగిగా విధులను సక్రమంగా నిర్వహించడంలో మహిళ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు. ఈ నేపథ్యంలో ఓ ఐఏఎస్ ఆఫీసర్ తన చిన్నారి కొడుకుని తీసుకుని అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలకు హాజరయ్యారు. అంతేకాదు.. అక్కడ ఆమె చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. కలెక్టర్ దివ్య అయ్యర్ తన మూడున్నరేళ్ల కొడుకు మల్హర్‌ని అడూర్‌లో జరుగుతున్న ఆరవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకకు తీసుకుని వచ్చారు. అంతేకాదు..దివ్య అయ్యర్ చేతుల్లో బిడ్డ ఎత్తుకుని ప్రసంగించారు. అయితే కలెక్టర్ అయ్యర్ చేసిన పనిని కొందరు విమర్శిస్తే.. మరికొందరు అదే కదా అమ్మ మనసు అంటూ మద్దతు తెలుపుతున్నారు. మహిళ తన భర్తతో సహా, మహిళలు పోషించే బహుళ పాత్రలు, పిల్లలతో వారి క్షణాలను గడిపే హక్కును ప్రస్తావిస్తూ అయ్యర్ చేసిన పనికి తమ మద్దతు తెలుపుతున్నారు.

అక్టోబరు 30న జరిగిన మూడు రోజుల ఈవెంట్ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ దివ్య అయ్యర్ తన కుమారుడితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఈవెంట్ నిర్వాహకులలో ఒకరైన చిట్టయం గోపకుమార్ తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో  వివాదానికి దారితీసింది. అయితే ఈ వీడియోను తన ఎఫ్‌బీ పేజీ నుంచి తొలగించారు. ఈ వీడియోలో, దివ్య తన బిడ్డతో వేదికపై తన తనయిడిని కౌగిలించుకుని కూర్చున్నారు. అంతేకాదు.. తాను వేదిక మీద ప్రసంగం చేయాల్సిన సమయంలో లేచి నిలబడి అప్పుడు కూడా తన చిన్నారి తనయుడితో ఆప్యాయంగా మాట్లాడటం చూడవచ్చు.

ఫేస్‌బుక్ పోస్ట్‌లో దివ్య భర్త, కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు కేఎస్ శబరినాధన్ తన భార్యను సమర్థించారు. పని చేసే తల్లులకు ఎవరి సానుభూతి అవసరం లేదని.. అయితే.. వారికి పని చేసేందుకు సమాజం సానుకూలంగా అవకాశం కల్పించాలని అన్నారు. ఉన్నత స్థాయి అధికారి తన బిడ్డను ఒక కార్యక్రమానికి తీసుకురావడం సరికాదని పలువురు దివ్యను విమర్శించగా.. మరికొందరు కలెక్టర్‌కు మద్దతుగా నిలిచారు. అంతేకాదు న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెర్న్ ఐక్యరాజ్య సమితి శాంతి శిఖరాగ్ర సదస్సులో తన ముగ్గురి పిల్లల్ని తీసుకువచ్చి విషయాన్నీ గుర్తు చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

కలెక్టర్ దివ్యకు ప్రఖ్యాత మలయాళ రచయిత బెన్యామిన్, సామాజిక కార్యకర్త ధన్యా రామన్ మద్దతునిచ్చిన వారిలో ఉన్నారు. పిల్లలందరూ తమ తల్లుల ప్రేమను ఆస్వాదిస్తూ ఎదగడానికి అవకాశం ఇవ్వమని సోషల్ మీడియా వేదికగా కోరారు.

అయ్యర్‌ జిల్లా కలెక్టర్‌గానే కాకుండా భార్య, తల్లి, స్నేహితురాలు ఇలా బహువిధ పాత్రలు పోషించే వ్యక్తి అని బెన్యామిన్ అన్నారు. ఆమెకు ప్రైవేట్ మూమెంట్స్ కూడా అవసరమని.. తన బిడ్డతో కొంత సమయం గడిపే హక్కు కూడా కలెక్టర్ కు ఉందని పేర్కొన్నారు.

ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌కు హాజరైన సమయంలో చిన్నారిని తన వెంట తల్లి తీసుకెళ్లడంలో అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ‘తల్లి, బిడ్డల హక్కుల గురించి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం’ అని కూడా అన్నారు. అనేక విదేశాల్లో మహిళలు తమ బిడ్డలతో బహిరంగ వేదికలు, పార్లమెంట్‌లు, శాసనసభలకు వస్తే వారి పట్ల గౌరవాన్ని చూపిస్తారు. అదే మన దేశంలో మాత్రం ఓ అధికారి తన పిల్లతో విధులకు హాజరైతే.. దానిని తప్పుగా ఎందుకు భావిస్తారంటూ ప్రశ్నించారు.

చిన్నారిని బహిరంగ కార్యక్రమానికి తీసుకురావడం ద్వారా కలెక్టర్ ఔచిత్యం లేకుండా వ్యవహరించారంటూ కలెక్టర్ చర్యను విమర్శిస్తున్నారు మరొకొందరు నెటిజన్లు. మహిళా అధికారి “ఓవర్ యాక్ట్” చేసిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..