AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

First Indian Voter: ముగిసిన దేశంలో తొలి ఓటరు ప్రస్థానం.. శ్యామ్ శరణ్ నేగి కన్నుమూత .. సంతాపం తెలిపిన ప్రధాని

స్వతంత్ర భారతదేశపు మొదటి ఓటరు అయిన శ్యామ్ శరణ్ నేగి ఒక ఆడియో ఇంటర్వ్యూలో స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం తర్వాత అనేక ఆసక్తికరమైన కథలను వివరించాడు. శుక్రవారం అర్థరాత్రి మృతి చెందాడు. ఆయన మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.

First Indian Voter: ముగిసిన దేశంలో తొలి ఓటరు ప్రస్థానం.. శ్యామ్ శరణ్ నేగి కన్నుమూత .. సంతాపం తెలిపిన ప్రధాని
First Voter Of India Shyam Negi
Surya Kala
|

Updated on: Nov 05, 2022 | 12:37 PM

Share

స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి నేడు కన్నుమూశారు. 1917లో జన్మించిన శ్యామ్ శరణ్ నేగి.. తాను చూసిన బ్రిటిష్ పాలన గురించి అనేక సార్లు కథలు కథలుగా చెప్పేవారు. ఆయన వయస్సు 106 సంవత్సరాలు. మూడు సంవత్సరాల క్రితం శ్యామ్ శరన్ నేగితో చేసిన ఆడియో ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత ఆయన చెప్పిన కథలు ఎవరో ముత్తాత మర్రి నీడలో గతకాలపు కథలు చెబుతున్నట్లు అనిపింస్తుంది. శ్యామ్ 25 అక్టోబర్ 1951 సాధారణ ఎన్నికలలో తన మొదటి ఓటు వేశారు. తన చిన్నతనంలో భారతదేశంపై బ్రిటిష్ పాలన.. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించి 1952లో తొలిసారి ఓటింగ్‌ నిర్వహిన గురించి కూడా శ్యామ్ మాటల్లో అనేక విషయాలను చెప్పేవారు. భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు. దీంతో మొదటి సారి  హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో  విపరీతమైన మంచు కురుస్తున్నందున ..  ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఆ రోజుల్లో తాను మురుంగ్ తోలిలో ఉన్నానని.. ఎన్నికల్లో సందర్భంగా విధులు నిర్వహిస్తున్నట్లు శ్యామ్ చెప్పారు. ఆ సమయంలో ప్రజలకు ఓటు వేయమని చెప్పమని ఎన్నికల అధికారికి చెప్పాను. అంతేకాదు తాను మొదట ఓటు వేశానని పేర్కొన్నారు

1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవారని చెప్పారు. మేము స్వేచ్ఛగా ఉన్నాము. ఊపిరి పీల్చుకున్నాము.  కాలక్రమేణా దేశంలో పేదరికం, నిరక్షరాస్యత వంటి సమస్యలన్నీ తొలగిపోతాయని తాను నమ్మానని పేర్కొన్నారు. ఎన్నికల తరుణం రాగానే ఓ ఎన్నికల అధికారి.. 30, 40 శాతం ఓటింగ్‌ జరిగితే పెద్ద విషయమేనని అన్నారు.అప్పుడు తాను ఎన్నికలల్లో ఓటు వేయడం ప్రతి భారతీయుడి ప్రాధమిక హక్కని చెప్పి.. ఓటు వేయడం తన కర్తవ్యంగా భావించి.. . మరుసటి రోజు సాయంత్రం ఇంటికి వెళ్లి ఉదయం 6 గంటలకే ఓటింగ్ కేంద్రానికి చేరుకున్నానని శ్యామ్ తాను మొదటిసారి ఓటు వేసిన సందర్భాన్ని పేర్కొన్నారు. అప్పుడు ఎన్నికల ఓటింగ్ జరిగే ప్లేస్ కు ఎవరూ రాలేదు. నేను కూర్చున్నాను, అధికారులు వచ్చిన వెంటనే.. తాను కూడా ఎన్నికల డ్యూటీలో ఉన్న వ్యక్తిని.. కనుక ముందు నాకు ఓటు వేసే అవకాశం ఇవ్వమని.. నేను మళ్ళీ ఎన్నికల విధుల్లో పాల్గొనడం కోసం కాలినడకన ఇంకా చాలా దూరం వెళ్లాలని పేర్కొన్నట్లు అప్పటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు శ్యామ్. తర్వాత అధికారులు రిజిస్టర్ తెరిచి పేర్లతో సరిచూసి స్లిప్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

శ్యామ్ నేగి ఇంటర్వ్యూ 

నేగి మాట్లాడుతూ, ‘దాదాపు మూడు లేదా అంతకంటే ఎక్కువ ఎన్నికలు గడిచాయి. ఆ తర్వాత ఓటు వేయడానికి నేను అక్కడికి చేరుకోగా, మీరు మొదటిసారి ఎక్కడ ఓటు వేశారని అధికారులు చెప్పారు. నీ వయసెంత? అన్ని ప్రశ్నలూ అడిగారు, ఆ తర్వాత స్వతంత్ర భారత తొలి ఓటరు నేనే అని చెప్పారు. నేను ఇప్పటి వరకు ఏ ఎన్నికలను వదిలిపెట్టలేదు. ప్రతి ఎన్నికల్లోనూ ఓటేశా. అసెంబ్లీ గురించి మాట్లాడినా, లోక్ సభ అయినా, పౌర ఎన్నికలైనా. ప్రతి ఎన్నికల్లో ఓటు వేసినట్లు శ్యామ్ ఆ ఇంటర్యూలో పేర్కొన్నారు.

శుక్రవారం  మృతి స్వతంత్ర భారతదేశం మొదటి ఓటరు అయిన శ్యామ్ శరణ్ నేగి శుక్రవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో మృతి చెందాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో నివసిస్తున్న నేగి వయస్సు 106 సంవత్సరాలు. అతను నవంబర్ 2న తన ఇంటి నుండి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2022కి చివరి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం శ్యామ్ శరణ్ మాట్లాడుతూ ఓటు వేయడం ప్రజాస్వామ్యానికి గొప్ప పండుగ అని అన్నారు. మనమందరం మన ఓటుహక్కుని  తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. అదే సమయంలో, ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశంలోని మొట్టమొదటి ఓటరు నేగీని ప్రశంసించారు అయన కొత్త తరానికి ఓటు వేయడానికి ప్రేరణనిస్తున్నారని పేర్కొన్నారు. శ్యామ్ శరణ్ నేగి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..