AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి మరమ్మతుల కోసం రూ. 2కోట్లు చెల్లించిన ప్రభుత్వం.. ఖర్చు చేసింది మాత్రం..

వంతెన పూర్తి పునరుద్ధరణకు నిధులు విడుదలయ్యాయి. ఒరేవా కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత తనిఖీ చేసే జోలికి వెళ్లలేదు. 6 నెలల తర్వాత, ఒరేవా సంస్థ నిర్ణీత సమయానికి ముందే వంతెనను పునరుద్ధరించి ప్రజల ఉపయోగం కోసం ప్రారంభించినట్లు ప్రకటించింది.

మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి మరమ్మతుల కోసం రూ. 2కోట్లు చెల్లించిన ప్రభుత్వం.. ఖర్చు చేసింది మాత్రం..
Morbi Cable Bridge Collapse
Jyothi Gadda
|

Updated on: Nov 05, 2022 | 12:36 PM

Share

గుజరాత్‌లోని మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జి మరమ్మతుల విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం జరిగిందని ఇప్పటికే వెల్లడైంది. కేవలం సీకులకు రంగులు వేసి బ్రిడ్జి రిపేర్లు పూర్తి చేశారంటూ ఇప్పటికే పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. యువకుల అత్యుత్సాహం కారణంగా వందలాది మంది అమాయకులు జల సమాధి అయ్యారు. గడియారాల తయారీ సంస్థ ఒరేవా వంతెన పునరుద్ధరణ కాంట్రాక్టును పొందింది. వంతెన పునరుద్ధరణకు ప్రభుత్వం 2 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కానీ ఒరేవా సంస్థ మాత్రం కేవలం 12 లక్షల రూపాయలతో బ్రిడ్జికి రంగులు వేసి సిద్ధం చేసింది. మిగిలిన 1.88 కోట్ల రూపాయలను స్వాహా చేసినట్టుగా తెలుస్తోంది. కేటాయించిన మొత్తంలో కేవలం 6 శాతం నిధులను వినియోగించిందని విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

వంతెన పూర్తి పునరుద్ధరణకు నిధులు విడుదలయ్యాయి. ఒరేవా కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత తనిఖీ చేసే జోలికి వెళ్లలేదు. 6 నెలల తర్వాత, ఒరేవా సంస్థ నిర్ణీత సమయానికి ముందే వంతెనను పునరుద్ధరించి ప్రజల ఉపయోగం కోసం ప్రారంభించినట్లు ప్రకటించింది. తూతూ మంత్రంగా పనిచేసి తీగలకు రంగులేసి, మార్బుల్స్‌ను పాలిష్‌ చేసి మరమ్మతులు పూర్తయినట్లుగా చూపించారని తెలుస్తోంది.

135 మంది మృతికి కారణమైన గుజరాత్‌లోని మోర్బీ వంతెనను పునర్నిర్మించామని అజంతా ఒరేవా కంపెనీ చెబుతున్నప్పటికీ, తుప్పుపట్టిన స్టీల్ కేబుల్‌ను మార్చలేదు. బ్రిడ్జి మాత్రమే కొత్తగా వేశారు. బ్రిడ్జి బరువును తట్టుకోలేక కేబుల్ తెగిపడిందని ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా, అరెస్టయిన అజంతా ఒరేవా కంపెనీ మేనేజర్ దీపక్ పరేఖ్ బ్రిడ్జి విపత్తు ‘దేవుని చిత్తం’ అని కోర్చ్ ముందు షాకింగ్ స్టేట్‌మెంట్ ఇవ్వడం ద్వారా సంఘటనను సమర్థించారు.

ఇవి కూడా చదవండి

దాదాపు 143 ఏళ్లనాటి సస్పెన్షన్‌ బ్రిడ్జి ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయని, పర్యాటకుల కోసం తిరిగి తెరవచ్చని ఒరేవా గ్రూప్‌ ఛైర్మన్‌ జైకుష్‌ పటేల్‌ గత నెల 24న ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి భద్రతా పరమైన అనుమతులు లేకుండా నిర్వహణ సంస్థ.. పర్యాటకులను బ్రిడ్జిపైకి అనుమతించింది. ఈ క్రమంలో గత నెల 30న కేబుల్ బ్రిడ్జి కుప్పకూలడంతో 135 మంది మృత్యువాత పడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి