AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: డ్రైనేజీ పనుల కోసం ఆస్పత్రిలో తవ్వకాలు.. కనిపించిన దృశ్యం చూసి కంగుతిన్న కార్మికులు..

భారతదేశం చారిత్రక ఘట్టాలు, వీరోచిత పోరాటాలకు నిదర్శనం. రాజులు, బ్రిటీష్‌ వాళ్లు దేశాన్ని పరిపాలించారు. అందుకు గుర్తులుగా ఇప్పటికీ కొన్ని కట్టడాలు, స్మారక చిహ్నాలు జ్ఞాపకాలకు తార్కాణాలుగా నిలుస్తాయి. కాలక్రమంలో...

Mumbai: డ్రైనేజీ పనుల కోసం ఆస్పత్రిలో తవ్వకాలు.. కనిపించిన దృశ్యం చూసి కంగుతిన్న కార్మికులు..
British Tunnel In Mumbai
Ganesh Mudavath
|

Updated on: Nov 05, 2022 | 12:12 PM

Share

భారతదేశం చారిత్రక ఘట్టాలు, వీరోచిత పోరాటాలకు నిదర్శనం. రాజులు, బ్రిటీష్‌ వాళ్లు దేశాన్ని పరిపాలించారు. అందుకు గుర్తులుగా ఇప్పటికీ కొన్ని కట్టడాలు, స్మారక చిహ్నాలు జ్ఞాపకాలకు తార్కాణాలుగా నిలుస్తాయి. కాలక్రమంలో రాజులు పోయారు. రాజరిక వ్యవస్థ అంతమై ప్రజాస్వామ్య వ్వవస్థ అందుబాటులోకి వచ్చింది. గ్రామాలు పట్టణాలుగా, పట్టణాలు గ్రామాలుగా రూపొందాయి. టెక్నాలజీ యుగంలో శరవేగంగా అభివృద్ధి చెందాయి. అయినా అడపా దడపా గతం తాలూకూ జ్ఞాపకాలు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబయి లో బ్రిటీష్ కాలం నాటి సొరంగం బయటపడింది. జేజే హాస్పిటల్ ప్రాంగణంలో దీనిని గుర్తించారు. నీటి లీకేజీని అరికట్టేందుకు తవ్వకాలు జరుపుతుండగా ఈ రహస్య సొరంగం బయటపడినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. గ్రాంట్ మెడికల్ కాలేజ్, సర్‌ జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌ను జేజే హాస్పిటల్స్ అని పిలుస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అతి పురాతన వైద్య సంస్థ ఇది. మహిళలు, పిల్లలకు చికిత్సలు అందించిన వార్డు భవనాన్ని అనంతరం నర్సింగ్‌ కాలేజీగా మార్చారు.

ఈ భవనం కింద 200 మీటర్ల పొడవైన సొరంగాన్ని రెండు రోజుల కిందట గుర్తించారు. శిలా ఫలకంపై 1890 అని ఉంది. దీంతో ఈ సొరంగాన్ని 132 ఏళ్ల కిందట నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ రహస్య సొరంగాన్ని గుర్తించిన వెంటనే హాస్పిటల్ అధికారులు ఆ సమాచారాన్ని జిల్లా కలెక్టరుకు, పురావస్తు శాఖ అధికారులకు తెలిపారు. 1845లో నాటి బ్రిటీష్‌ పాలనలో ప్రారంభించిన చారిత్రక వైద్య కాలేజీ భవనం కింద రహస్య మార్గం ఉండవచ్చని ప్రచారం ఉందని, దీనిని బట్టి అది ఇదే కావచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

కాగా.. గతంలో జమ్మూ కశ్మీర్‌ సాంబా సెక్టార్‌లోని సరిహద్దు వెంబడి 150 మీటర్ల పొడవున్న రహస్య సొరంగ మార్గాన్ని జవాన్లు కనుగొన్నారు. ఈ విషయాన్ని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ నిర్ధరించారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిబ్బంది ఈ సొరంగ మార్గాన్ని గుర్తించారు. ఉగ్రవాదులు సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబడేందుకు ఈ సొరంగాన్ని ఉపయోగించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..