PM Modi: ఈ నెల 12 న తెలంగాణకు ప్రధాని.. రామగుండంలో పర్యటన..

ఈ నెల 12 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. రామగుండంలో పర్యటించనున్న మోదీ.. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ కు ప్రత్యేక..

PM Modi: ఈ నెల 12 న తెలంగాణకు ప్రధాని.. రామగుండంలో పర్యటన..
PM Modi
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 04, 2022 | 9:52 PM

ఈ నెల 12 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. రామగుండంలో పర్యటించనున్న మోదీ.. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ కు ప్రత్యేక విమానంలో రానున్న ప్రధాని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌ లో రామగుండం చేరుకుంటారు. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటన కారణంగా రాష్ట్ర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వేదికల వద్ద సెక్యూరిటీ, శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదని చెప్పారు. అయితే ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జాతీయ పార్టీ ప్రకటించిన కేసీఆర్ ప్రధానిని కలుస్తారా లేదా అనేది ఆసక్తికరం.

కాగా.. నవంబర్ 11న ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రైల్వే స్టేషన్ నవీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలకూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం జగన్ తో పాటుగా గవర్నర్ బిశ్వభూషణ్ ప్రధాని పర్యటనలో పాల్గొనున్నారు. కాగా.. ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..