Munugode By Elections: రికార్డు స్థాయిలో పోలింగ్.. సానుకూల పవనాలు ఏ పార్టీ లాభం కలిగించేనో..

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక రిజల్ట్ మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన పోలింగ్.. గురువారం ముగియడంతో అక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది..

Munugode By Elections: రికార్డు స్థాయిలో పోలింగ్.. సానుకూల పవనాలు ఏ పార్టీ లాభం కలిగించేనో..
Munugode Elections
Follow us

|

Updated on: Nov 05, 2022 | 6:41 AM

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక రిజల్ట్ మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన పోలింగ్.. గురువారం ముగియడంతో అక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రికార్డు స్థాయిలో 93.13 శాతం నమోదైన పోలింగ్ ఏ పార్టీకి లాభం కలిగిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ముందుగా 92 శాతం పోలింగ్ నమోదైందని ప్రకటించిన అధికారులు.. గురువారం రాత్రి వరకు సాగిన పోలింగ్‌ కారణంగా క్యూలైన్లలో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని అధికారులు చెబుుతన్నారు. 2018 ఎన్నికల్లో 91.3 శాతం పోలింగ్‌ నమోదవగా ప్రస్తుతం 1.8 శాతం పెరుగుదల ఉండటం విశేషం. ఈవీఎం లను నల్గొండలోని ఆర్జాలబావి గిడ్డంగుల సంస్థ వద్దకు చేర్చారు. స్ట్రాంగ్‌రూమ్‌కు శుక్రవారం తెల్లవారుజామున సీల్‌ వేశారు. ఈ క్రమంలో ఆదివారం చేపట్టే కౌంటింగ్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 15 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 9 గంటల కల్లా తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. ఫైనల్ రిజల్ట్ మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

లెక్కింపు లో భాగంగా ముందుగా చౌటుప్పల్‌ మండలంలోని ఓట్లను లెక్కిస్తారు. అనంతరం సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల మండలాల ఈవీఎంలను టేబుళ్ల వద్దకు తరలిస్తారు. ఈ క్రమంలో లెక్కింపు సందర్భంగా సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఓటర్లను ఆకట్టుకునేందుకు నెల రోజుల పాటు విస్తృత ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోలింగ్‌ సరళిని అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు. పోలైన 2,25,192 ఓట్లలో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండలాల ముఖ్య నాయకులతో ఫోన్ లో చర్చించారు. ఎన్నికల కోసం శ్రమించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఏజెంట్ల నియామకంపై చర్చ జరిపారు. మండలాల వారీగా పార్టీకి ఎన్ని ఓట్లు పోలై ఉంటాయని నాయకులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనుగోడులోని క్యాంపు కార్యాలయంలో అన్ని మండలాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles