Pawan Kalyan: తాగిన మైకంలో న్యూసెన్స్ చేశారు.. రెక్కీకి కుట్ర జరలేదు.. పోలీసుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి ముందు రెక్కీ ఘటనపై పోలీసులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పవన్‌పై ఎలాంటి రెక్కీ గానీ, దాడికి గానీ కుట్ర..
ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి ముందు రెక్కీ ఘటనపై పోలీసులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పవన్‌పై ఎలాంటి రెక్కీ గానీ, దాడికి గానీ కుట్ర జరగలేదని పోలీసులు నిర్ధరించారు. పవన్ ఇంటి వద్ద సంచరించిన వాళ్లు ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణ గా గుర్తించారు. వీరంతా పబ్‌కు వెళ్లి, మద్యం తాగి ఉన్నారని, తిరిగి వస్తూ పవన్ ఇంటి ముందు కారు ఆపారని చెప్పారు. ఇదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కారు తీయాలని చెప్పినట్లు వివరించారు. అయితే వారి మాట వినకుండా సదరు యవకులు సెక్యూరిటీ సిబ్బందితలో గొడవ పడినట్టు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు యువకులను విచారించి నోటీసులు ఇచ్చారు. తాగిన మైకంలోనే న్యూసెన్స్ చేసినట్టు నిందితులు అంగీకరించారు. పవన్ ఇంటి ముందు ఆపిన కారుకు గుజరాత్ రిజిస్ట్రేషన్ ఉండగా అది సాయికృష్ణకు చెందిన కారుగా పోలీసులు స్పష్టం చేశారు.
అయితే.. విశాఖలో ఘర్షణలు జరిగినప్పటి నుంచి పవన్ కల్యాణ్ ను అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు తిరుగుతున్నాయని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు కనబడుతున్నారన్నారు. వాహనాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు. అనుసరిస్తున్న వారు అభిమానులు కాదన్న మనోహర్.. వారి కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయన్నారు. గత సోమవారం అర్దరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ కల్యాణ్ ఇంటి వద్ద గొడవ చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని బూతులు తిడుతూ, దుర్భాషలాడుతూ ఘర్షణకు దిగారు. ఈ సంఘటనను వీడియో తీసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పవన్ హత్యకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని, జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ పై రెక్కీ నిర్వహణతో అనేక అనుమానాలున్నాయన్నారు. అన్ని సర్వేలలో పవన్ సీఎం అవుతారని రావడంతో కొందరు కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..