Uttar Pradesh: కలకలం రేపిన పరువు హత్య.. చెల్లిని హత్య చేసిన అన్న.. కారణం ఏంటంటే..

తండ్రి చనిపోయాడు.. తల్లి కూలీనాలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటోంది. కుమారుడు, కుమార్తెతో ఉన్నంతలో బతుకీడుస్తోంది. అంతా సవ్యంగా జరిగిపోతున్న కుుటంబంలో ప్రేమ చిచ్చు రేపింది....

Uttar Pradesh: కలకలం రేపిన పరువు హత్య.. చెల్లిని హత్య చేసిన అన్న.. కారణం ఏంటంటే..
Arrest
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 04, 2022 | 9:19 PM

తండ్రి చనిపోయాడు.. తల్లి కూలీనాలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటోంది. కుమారుడు, కుమార్తెతో ఉన్నంతలో బతుకీడుస్తోంది. అంతా సవ్యంగా జరిగిపోతున్న కుుటంబంలో ప్రేమ చిచ్చు రేపింది. సోదరి పక్కింటి యువకుడితో సాన్నిహితంగా ఉండటాన్ని సోదరుడు తట్టుకోలేకపోయాడు. పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎన్ని సార్లు చెప్పినా తన మాట వినడం లేదని చెల్లిపై కోపం పెంచుకున్నాడు. వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ప్రేమిస్తూ కుటుంబం పరువు తీస్తోందని కోపంతో రగిలిపోయాడు. మాట వినని చెల్లిని చంపేయాలనుకున్నాడు. అందరూ నిద్రపోతున్న సమయంలో కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తల్లిని ఒంటిరిని చేసి, జైలు పాలయ్యాడు. ఉత్తర ప్రదేశ్‌ లోని గోండాలో ఓ బాలిక తన కుటుంబంతో కలిసి నివాసముంటోంది. ఆమెకు పక్కింట్లో ఉండే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వారి మధ్య ఇష్టానికి దారి తీసింది. ఇద్దరు చెట్టాపెట్టాల్ వేసుకుని తిరిగారు. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. వాట్సాప్ లో చాటింగ్ చేయడం మొదలు పెట్టారు.

ఈ తతంగాన్నంతా గమనిస్తున్న బాలిక సోదరుడు.. ఆమెను పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. యువకుడితో మాట్లాడవద్దని హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె వినలేదు. ఈసారి ఏకంగా ఫోన్‌లో మాట్లాడుతూ దొరికిపోయింది. దీంతో అన్న కోపం పట్టలేకపోయాడు. సోదరితో గొడవకు దిగాడు. ఘర్షణ జరిగిన కొన్ని రోజులకు బాలిక, యువకుడు చనువుగా ఉండటాన్ని సోదరుడు గమనించాడు. సోదరి తన మాట వినడం లేదని, కుటుంబం పరువు తీసేస్తుందని ఆమెను అంతమొందించాలని నిర్ణయించాడు. రాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్న సమయంలో పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

అనంతరం సోదరుడు కాట్రా బజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పరువు హత్య కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా మూడేళ్ల క్రితమే నిందితుడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లి సోదరితో కలిసి దామోదర్‌ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో సోదరి సాన్నిహత్యంగా ఉండటాన్ని తట్టుకోలేక ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి