Glaucoma: కంటి చూపును దొంగిలించే గ్లకోమా గురించి మీకు తెలుసా? గుర్తించడం చాలా కష్టం..

అతిగా నిద్రపోవడం.. తక్కువగా నిద్రపోవడం.. పగటి పూట నిద్ర, నిద్రలో గురక.. వీటిల్లో ఏదైన అలవాటు మీకు కూడా ఉందా? ఐతే త్వరలో మీరు గ్లకోమా భారీన పడటం ఖాయం. ఓపెన్ యాక్సెస్ జర్నల్‌లో ప్రచురించబడిన యూకే బయోబ్యాంక్ అధ్యయనం..

Glaucoma: కంటి చూపును దొంగిలించే గ్లకోమా గురించి మీకు తెలుసా? గుర్తించడం చాలా కష్టం..
What Causes Glaucoma?
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 04, 2022 | 9:28 PM

అతిగా నిద్రపోవడం, తక్కువగా నిద్రపోవడం, పగటి పూట నిద్ర, నిద్రలో గురక.. వీటిల్లో ఏదైన అలవాటు మీకు కూడా ఉందా? ఐతే త్వరలో మీరు గ్లకోమా భారీన పడటం ఖాయం. ఓపెన్ యాక్సెస్ జర్నల్‌లో ప్రచురించబడిన యూకే బయోబ్యాంక్ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. గ్లకోమా ప్రారంభ లక్షణాలు/సంకేతాలను గుర్తించడానికి చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. దీర్ఘకాలిక నిద్ర రుగ్మతలతో బాధపడేవారు గ్లకోమా ప్రమాదం బారీన పడే అవకాశం ఎక్కవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

గ్లకోమా అంటే..

కంటి సంబంధిత వ్యాధుల్లో ప్రమాదకరమైనది గ్లకోమా. దీని లక్షణాలు బయటకు కనిపించవు. ఇది బాగా ముదిరిపోయిన తర్వాతే బయట పడుతుంది. అప్పటికే చూపు చాలా తగ్గిపోతుంది. నిశ్శబ్దంగా కంటిచూపును కబళించి శాశ్వత అంథత్వాన్ని తెచ్చే గ్లకోమాపై అవగాహన చాలా అవసరం. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా 112 మిలియన్ల మంది అంధత్వానికి కారణమయ్యే గ్లకోమా బారీన పడే అవకాశం ఉందని అంచనా. కంటిలోని అతి సున్నితమైన కాంతి కణాల (లైట్‌ సెన్సిటివ్‌ సెల్స్‌) క్షీణత, ఆప్టిక్ నరాలు దెబ్బతినడం వల్ల గ్లకోమా ప్రమాదం సంభవిస్తుందని పరిశోధకులు తేల్చారు. అయినప్పటికీ గ్లకోమా వ్యాధి లక్షణాలు, కారకాలు ఇప్పటికీ పూర్తిగా నిర్థారణకాలేదు. ఐతే ఈ వ్యాధికి సకాలంలో చికిత్స అందిచకపోతే, శాశ్వత అంధత్వానికి కారణమవుతుంది.

గ్లకోమా ఎందుకు వస్తుందంటే..

అతి తక్కువగా నిద్రపోయే వారు అంటే నిద్రలేమితో బాధపడేవారిలో గ్లాకోమా వచ్చే ప్రమాదం ఎక్కవ. అదేవిధంగా అతిగా నిద్రపోయే వారు కూడా ఈ వ్యాధి బారీన పడే అవకాశం ఉంది. అలాగే పగటి నిద్ర, గురక.. వంటి అలవాట్లు ఉన్న వారికి గ్లకోమా వచ్చే అవకాశం ఉన్నట్లు యూకే బయోబ్యాంక్‌లో 2006 నుంచి 10 మద్యకాలంలో పాల్గొన్న 40 నుంచి 69 మధ్య వయసున్న దాదాపు 4,09,053ల మందిపై నిర్వహించిన పరిశోధనలో బయటపడింది. రోజుకు 7 నుంచి 9 గంటల కంటే తక్కువ నిద్ర పోవడాన్ని నిద్రలేమి అంటారు. రాత్రిళ్లు సరైన నిద్రపోని వాళ్లు పగటి నిద్రను ఆశ్రయిస్తుంటారు. కంటి ఆరోగ్యం దృష్ట్యా ఇది చాలా ప్రమాదకరం. నిద్రలేమితో12 శాతం, గురకతో 4 శాతం, పగటిపూట నిద్రతో 20 శాతం గ్లకోమా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి నిద్ర విధానాలను బట్టి ఇది ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

గ్లకోమా ప్రమాదం వీరికి ఎక్కువ..

గ్లకోమాతో బాధపడేవారిలో పురుషులు అధిక సంఖ్యలో ఉన్నట్లు పరిశోధనల్లో బయటపడింది. ధూమపానం చేసేవారు, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలున్న పురుషులు ఈ వ్యాధిబారీన పడుతున్నారు.

గ్లకోమా అభివృద్ధిలో కీలకపాత్ర వహించేది కంటి అంతర్గత ఒత్తిడి. ఒత్తిడి ఎంత ఉంటే అవయవాలు అంతగా దెబ్బతింటాయి. ఒక వ్యక్తిలో నిద్ర హార్మోన్లు తగ్గినప్పుడు గ్లకోమా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కంట్లో కనిపించే గ్లకోమా అలాంటిదే. గ్లకోమా మొదలయినపుడు డిప్రెషన్, ఆందోళన పెరుగుతుంది. దీంతో కంటినిండా నిద్ర కరువవుతుంది. అదేవిధంగా స్లీప్ అప్నియా (నిద్రలో అకస్మాత్తుగా శ్వాస ఆగిపోవడం) ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సరైన నిద్ర అలవాట్లు కంటి ఆరోగ్యంతోపాటు శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇతర హెల్త్ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి.