Twitter: ‘ఆఫీసుకు బయల్దేరుతున్నారా..? దయచేసి ఇంటికి తిరిగి వెళ్లండి’ 3,700 ట్విటర్‌ ఉద్యోగులపై ఎలన్‌ మస్క్‌ వేటు!

ట్విటర్‌ కొత్త యజమాని ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ట్విటర్‌ మస్క్‌ హస్తగతం అయిన తర్వాత.. గత వారం రోజులుగా కంపెనీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఐతే ఖర్చులను తగ్గించుకోవడానికి భారత్‌లోని..

Twitter: 'ఆఫీసుకు బయల్దేరుతున్నారా..? దయచేసి ఇంటికి తిరిగి వెళ్లండి' 3,700 ట్విటర్‌ ఉద్యోగులపై ఎలన్‌ మస్క్‌ వేటు!
Twitter Starts Sacking India Employees
Follow us

|

Updated on: Nov 04, 2022 | 7:54 PM

ట్విటర్‌ కొత్త యజమాని ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ట్విటర్‌ మస్క్‌ హస్తగతం అయిన తర్వాత.. గత వారం రోజులుగా కంపెనీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఐతే ఖర్చులను తగ్గించుకోవడానికి భారత్‌లోని ట్విటర్‌ ఉద్యోగుల తొలగింపు, తాత్కాలికంగా ట్విటర్‌ ఆఫీసులను మూసివేయడం, సిబ్బంది యాక్సెస్‌ నిరోధించడం వంటి  విషయాలపై మస్క్‌ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల కోత శుక్రవారం (అక్టోబర్‌ 4) 9 గంటల నుంచే ప్రారంభమైందని, అందుకు సంబంధించి సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్‌లను సైతం పంపించినట్లు రూటర్స్‌ కథనం వెల్లడించింది. ఉద్యోగుల కోతపై ట్విటర్‌ తీసుకున్న నిర్ణయం నెట్టింట తీవ్ర దుమారం రేపింది. ఇంజనీర్లు, సేల్స్‌ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌లతో సహా పలువురు ఉద్యోగులపై ప్రభావం పడనుంది. శుక్రవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ట్విటర్ ఆఫీసులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు శుక్రవారం ఈమెయిల్‌లను పంపి అప్రమత్తం చేసినట్లు తెలస్తోంది. ఉద్యోగుల కోతలు మొదలవుతున్న దృష్ట్యా సిబ్బంది ఇంటికి వెళ్లొచ్చని, శుక్రవారం ఆఫీసుకు రావొద్దని మెయిల్‌లో సూచించినట్లు సమాచారం. మీరు ఆఫీసులో ఉన్నా, ఇంటి నుంచి ఆఫీసుకు బయల్దేరుతున్నట్లైతే..దయచేసి ఇంటికి తిరిగి వెళ్లండని ట్విటర్‌ తమ ఉద్యోగులకు ఈ మెయిల్‌ పంపినట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పటి వరకు ట్విటర్ ప్రయాణంలో సిబ్బంది అందించిన సేవలు ఎంతో విలువైనవని, ఐతే ట్విటర్‌లో మార్పులు తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని ప్రభావం చాలా మందిపై పడుతుందని తెలిసినప్పటికీ కంపెనీ భవిష్యత్‌ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్‌ల సారాంశం.

ఇక ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బందికి రెండు నెలల జీతంతో పాటు, వారి ఈక్విటీలకు సమానమైన నగదును మూడు నెలల్లోగా చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరినీ తొలగించారనేది సిబ్బంది వ్యక్తిగత ఈమెయిల్‌ల ద్వారా సమాచారం ఇవ్వనున్నారట. ఇక ఉద్యోగాల్లో కొనసాగే సిబ్బందికి వారి వర్కుకు సంబంధించిన సమాచారాన్ని ఈమెయిల్‌లకు పంపించనున్నట్లు వార్తాకథనాలు తెల్పుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 3,700 మందిని విధుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఐతే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా ఇప్పటికే ట్విటర్‌ కంపెనీకి చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్, టాప్ ఫైనాన్స్, లీగల్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన విషయం తెలిసిందే. వీరితోపాటు కంపెనీ అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లో పనిచేసే సిబ్బందిని కూడా గత వారం మస్క్‌ తొలగించాడు. ఉద్యోగ తొలగింపుకు కనీసం 60 రోజుల ముందు ముందస్తు నోటీసులు అందిచాలనే ఫెడరల్, కాలిఫోర్నియా చట్టాలను ఉల్లంఘిస్తూ ఊహించని విధంగా ట్విటర్ ఉద్యోగులపై వేటు విషయమై శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో గురువారం దావా వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.