Saving Schemes: వేతన జీవులకు సరిగ్గా సరిపోయే సేవింగ్ స్కీమ్స్.. వీటిలో పొదపు ఎంతో భద్రం కూడా..
పొదుపు పథకాలను కేంద్రప్రభుత్వం బ్యాంకుల ద్వారా నిర్వహిస్తోంది. 2016 నుండి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసిక ప్రాతిపదికన చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తోంది. వివిధ పథకాల కింద వచ్చిన మొత్తం డబ్బు జాతీయ చిన్న పొదుపు నిధి..
పొదుపు అనేది జీవితంలో ఎంతో అవసరం. భవిష్యత్తుల్లో ఏర్పడే ఆర్థిక అవసరాలను తీర్చేందుకు నెలవారీ సంసాదనలో పొదుపు చేసుకోవడం నేటి రోజుల్లో తప్పనిసరైంది. ప్రతి ఒక్కరూ తమ స్థాయిని బట్టి పొదుపు చేసుకోవాలని అనుకుంటారు. అయితే చాలా మందికి పొదుపు ఎలా చేసుకోవాలో తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒక వేళ తాము చేసిన పొదుపు మొత్తానికి భద్రత ఉంటుందా లేదా అనే ఆలోచన వల్ల కూడా కొంతమంది సేవింగ్ స్కీమ్స్ లో దాచుకోవడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. మనకు వచ్చే ఆదాయాన్ని ఓ ప్లాన్ ప్రకారం ఖర్చు చేస్తూ.. కొంతమొత్తాన్ని సేవ్ చేసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో అత్యవసరమైన ఆర్థిక అవసరాలు ఏర్పడినప్పుడు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు మన ఆర్థిక అవసరాల కోసం అధిక వడ్డీ రేట్లకు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా మనం దాచుకున్న నగదును ఖర్చు చేసుకోవచ్చు. పొదుకు పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మనం దాచుకున్న మొత్తానికి వడ్డీ రావడంతో పాటు మన అత్యవసర ఆర్థిక అవసరాలు తీర్చుకోవడంలో సహాయపడతాయి. పొదుపు పథకాల్లోనూ వేతన జీవులకు సరిగ్గా సరిపోయే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. ఏ వయసులోనైనా క్రమం తప్పకుండా ఈ పథకాల్లో పొదుపు చేసుకోవచ్చు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు , సావరిన్ గ్యారెంటీ స్కీమ్ ల కంటే ఎక్కువ రాబడిని అందించడం వలన స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి.
ఇలాంటి పొదుపు పథకాలను కేంద్రప్రభుత్వం బ్యాంకుల ద్వారా నిర్వహిస్తోంది. 2016 నుండి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసిక ప్రాతిపదికన చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తోంది. వివిధ పథకాల కింద వచ్చిన మొత్తం డబ్బు జాతీయ చిన్న పొదుపు నిధి (నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్)లో పూల్ చేయబడుతుంది . ఈ నిధిలోని నగదును కేంద్రప్రభుత్వం ఆర్థిక లోటును తీర్చడానికి ఉపయోగిస్తుంది. ఆర్థిక లోటు అంటే ఈ నగదును ప్రభుత్వం దేశాభివృద్ధికి ఖర్చు చేస్తుంది. అయితే తన ఆదాయానికి మించి ఖర్చు చేస్తే దానిని ద్రవ్య లోటు అంటారు. చిన్న చిన్న పొదుపు పథకాల్లో పోస్టాఫీసు డిపాజిట్లు, సామాజిక భద్రతా పథకాలు వంటివి వస్తాయి. వీటిలో ముఖ్యమైన పథకాల గురించి తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్
పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ లో పొదుపు చేసుకోవడానికి నిర్థిష్టమైన వ్యవధి అంటూ ఏమి లేదు. ఈ పథకంలో పొదుపు చేస్తే 7.1% వడ్డీ రేటు లభిస్తుంది. కనీసం రూ. 500 నుంచి సేవింగ్ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ లేదు. రూ.10000 వరకు ఎటువంటి పన్నులు పడవు.
నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతా
నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కాల వ్యవధి ఐదు సంవత్సరాలు. వడ్డీ రేటు 5.8శాతం, కనీసం నెలకు రూ. 100 చొప్పున పొదుపు చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఖాతా తెరిచిన తేదీ నుండి మూడు సంవత్సరాల తర్వాత అకౌంట్ ను ముందస్తుగా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ తర్వాత, ఎటువంటి డిపాజిట్ లేకుండా దీనిని పొడిగించుకోవచ్చు.
నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్
ఈ పథకంలో వివిధ కాల వ్యవధులకు సంబంధించిన పథకాలు ఉన్నాయి. కనీసం ఒక ఏడాది, రెండేళ్లు, మూడేళ్లతో పాటు ఐదేళ్ల పాటు సేవింగ్ చేసుకోవచ్చు. ఐదేళ్ల వ్యవధి గల స్కీమ్ ను ఎంచుకుంటే వడ్డీ రేటు 6.7 శాతం. కనీసం రూ.1000 నుంచి పొదుపు చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు.
జాతీయ పొదుపు పథకం
ఈ పథకంలో పొదుపు చేయాల్సిన కాల వ్యవధి ఐదేళ్లు వడ్డీ 4శాతం, కనీసం రూ. 1000 నుంచి పొదుపు చేసుకోవచ్చు. గరిష్టంగా ఒకే ఖాతాలో 4 లక్షల 50 వేలు వరకు డిపాజిట్ చేయ్యచ్చు. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తారు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
ఈ పథకంలో కాల వ్యవధి ఐదేళ్లు. వడ్డీ రేటును 7.4 శాతం చెల్లిస్తారు. కనీసం వెయ్యి రూపాయల మొదలు గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. త్రైమాసికానికి ఒక సారి వడ్డీ చెల్లిస్తారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఆదాయపు పన్ను రాయితీ పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..