Twitter: ట్విట్టర్ లో సమూల మార్పులకు శ్రీకారం.. సీఈఓ కానున్న సంస్థ అధినేత..?

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను దక్కించుకున్న తర్వాత.. అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. శరవేగంగా మార్పులు చేస్తున్న ఎలన్ మస్క్ సంస్థలో సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశాలు..

Twitter: ట్విట్టర్ లో సమూల మార్పులకు శ్రీకారం.. సీఈఓ కానున్న సంస్థ అధినేత..?
Elon Musk, Twitter
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 01, 2022 | 1:52 PM

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను దక్కించుకున్న తర్వాత.. అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. శరవేగంగా మార్పులు చేస్తున్న ఎలన్ మస్క్ సంస్థలో సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సీఈవో తో సహా పలువురు ఉన్నత ఉద్యోగులను తొలగించిన ఎలన్ మస్క్ తాజాగా బోర్డు సభ్యులందరిపై వేటు వేశారు. ప్రస్తుతం ట్విటర్‌ బోర్డులో తానే ఏకైక డైరెక్టర్‌ అని పేర్కొన్నారు. ఈ మేరకు సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు సమర్పించిన వివరాల్లో ఎలన్ మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ట్విటర్‌ సీఈఓ పదవిని ఎలన్ మస్క్ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ట్విటర్‌ను తాను కొనుగోలు చేయడానికి ముందు డైరెక్టర్లుగా ఉన్నవారంతా ఇకపై ట్విటర్‌ బోర్డు సభ్యులుగా కొనసాగబోరని సంస్థ అధినేత ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ఈ జాబితాలో మాజీ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతానికి బోర్డులో తానొక్కడినే డైరెక్టర్‌గా ఉన్నానని, అయితే ఇది తాత్కాలికమేనని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్‌కు తెలిపాడు. ఇంతకంటే వివరాలేమీ మస్క్‌ వెల్లడించలేదని సమాచారం.

ఏకైక బోర్డు సభ్యుడిగా ఉన్న ఎలన్ మస్క్‌ ఇక ట్విటర్‌ సీఈఓగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పరాగ్‌ అగర్వాల్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించిన తర్వాత కొత్త సీఈఓను ఇప్పటివరకు నియమించలేదు. క్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు సమర్పించిన వివరాల్లో తానే ట్విటర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అని మస్క్‌ పేర్కొన్నట్లు కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

పెట్టుబడిదారుల్లో సౌదీ యువరాజు ట్విటర్‌ కొత్త ఇన్వెస్టర్లలో సౌదీ యువరాజు అల్వలీద్‌ బిన్‌ తలాల్‌, ట్విటర్‌ సహా వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సె ఉన్నట్లు తెలుస్తోంది. తలాల్‌కు చెందిన కింగ్‌డమ్‌ హోల్డింగ్‌ కంపెనీ ట్విటర్‌లో దాదాపు 35 మిలియన్ల షేర్లను 1.9 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో మస్క్ తర్వాత కంపెనీలో రెండో అతిపెద్ద ఇన్వెస్టర్‌గా సౌదీ యువరాజు ఉండనున్నారు. ఇక, జాక్‌ డోర్సే 978 మిలియన్‌ డాలర్లతో 18 మిలియన్ల షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ కూడా ఇన్వెస్టర్‌గా ఉన్నట్లు సమాచారం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!