Health Tips: ఉదయం అల్పాహారం తినడం లేదా? అయితే, ఈ ముప్పు పొంచి ఉన్నట్లే..

ఒక రోజు రోజంతా ఉపవాసం ఉన్నా ఎలాంటి సమస్యా ఉండదని, అయితే, ప్రతి రోజూ ఉదయం పూట తప్పనిసరిగా తినాలని సూచిస్తు్న్నారు వైద్యులు. చాలా మంది బరువు తగ్గాలనే తొందరలో..

Health Tips: ఉదయం అల్పాహారం తినడం లేదా? అయితే, ఈ ముప్పు పొంచి ఉన్నట్లే..
Breakfast
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 19, 2022 | 10:08 PM

ఒక రోజు రోజంతా ఉపవాసం ఉన్నా ఎలాంటి సమస్యా ఉండదని, అయితే, ప్రతి రోజూ ఉదయం పూట తప్పనిసరిగా తినాలని సూచిస్తు్న్నారు వైద్యులు. చాలా మంది బరువు తగ్గాలనే తొందరలో ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఏమీ తినకపోవడం వల్ల కోపం, ఏ పనీ చెయ్యాలని అనిపించకపోవడం, ప్రతిదానికీ చిరాకు పడటం, మలబద్ధకం, జుట్టు ఊడిపోవడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా యువతులు.. ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్(IF) వంటి ఆహారాన్ని ట్రై చేసినప్పుడు అది మానసిక, శారీరక ఆరోగ్యంపై పరభావం చూపుతుంది. సాధారణంగా రోజుకు మూడుసార్లు భోజనం తీసుకోవాలి. భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చారు పరిశోధకులు.

నష్టాలు..

ఉదయం పూట భోజనానికి, మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి ఎక్కువ గ్యాప్ తీసుకోవద్దని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కొందరు బరువు తగ్గడం కోసం ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం మానేస్తారని, అది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందన్నారు. బరువు తగ్గాలనే కారణంతో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సరైన సమయంలో తీసుకోకుంటే చాలా సమస్యలు తలెత్తుతాయి. బరువు తగ్గినా అనారోగ్యానికి గురికాక తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు.

అల్పాహారంతో ఉపయోగాలు..

అలా కాకుండా.. క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకుంటే ఆకలిని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతను ఇస్తుంది. శక్తిని పెంచుతుంది. తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వలన కాల్షియం వంటి సూక్ష్మపోషకాలను శరీరం గ్రహిస్తుంది. హిమోగ్లోబిన్ పెరుగుతుంది. కానీ, భోజనానికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే శరీరానికి సరైన పోషకాలు అందవు. ఫలితంగా అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అల్పాహారం తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గకపోగా, ఆకలి వేస్తుంది. ఆమ్లత్వం పెరుగుతంది. కడుపు ఉబ్బరం, ఆందోళన, తలనొప్పికి కారణం అవుతుంది. హిమోగ్లోబిన్, బి12, విటమిన్ డి లోపాలకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..