AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చిదే పవర్‌ఫుల్ మావ.. ఒక్క క్యారెట్‌తో పుట్టెడు లాభాలు.. ఇది తెలిస్తే అస్సలు వదలరు..

క్యారెట్లను పచ్చిగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. విటమిన్ ఎ, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. జీర్ణక్రియను ప్రోత్సహించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మహిళలకు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గర్భిణులకు, రక్తహీనత ఉన్నవారికి ఇది చాలా మంచిది. కాలేయ ఆరోగ్యాన్ని, మెదడు వికాసాన్ని కూడా పెంపొందిస్తుంది.

పచ్చిదే పవర్‌ఫుల్ మావ.. ఒక్క క్యారెట్‌తో పుట్టెడు లాభాలు.. ఇది తెలిస్తే అస్సలు వదలరు..
మద్యం ,అధిక ప్రోటీన్ తీసుకునే వారు కాలేయంపై భారాన్ని పెంచి, దాని పనితీరును ప్రభావితం చేస్తుంది. కానీ కాలేయం పనితీరును మెరుగుపరచడానికి ఆయుర్వేదం కొన్ని మార్గాలను సూచిస్తుంది.
Shaik Madar Saheb
|

Updated on: Mar 17, 2026 | 3:33 PM

Share

క్యారెట్ ను పచ్చిగా తినడం వలన శరీరానికి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. కూరగాయలలో తీయటిదైన క్యారెట్, రుచితో పాటు పోషకాలను కూడా అందిస్తుంది. పచ్చిగా తిన్నా, జ్యూస్ రూపంలో తీసుకున్నా లేదా వండినప్పటికీ, శరీరానికి ఇది ఎంతో మేలు చేస్తుందని.. ప్రతి ఒక్కరూ క్యారెట్ ను తినాలని సూచిస్తున్నారు. వాస్తవానికి క్యారెట్లు పోషకాల గని.. వీటిలో ముఖ్యంగా విటమిన్ ఎ, కె1, బి6, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు.. పలు సమస్యలతో పోరాడటంలో సహాయపడతాయి.

క్యారెట్ పచ్చిగా తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..

క్యారెట్ లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి చూపును అద్భుతంగా మెరుగుపరుస్తాయి.. కంటి కణాలు క్షీణించకుండా కాపాడతాయి. డైట్ చేసే వారికి క్యారెట్ ఒక చక్కని ఆహారం, ఎందుకంటే ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. పచ్చి క్యారెట్ ను మోతాదులో తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అయితే మధుమేహం ఉన్నవారు మాత్రం పరిమితంగా తీసుకోవడం మంచిది.

మహిళలు క్యారెట్ జ్యూస్ ను రోజూ తాగడం అలవాటు చేసుకుంటే రొమ్ము క్యాన్సర్ వంటివి దరిచేరకుండా ఉంటాయి. అంతేకాకుండా, మంచి మేనిఛాయను కూడా సంతరించుకుంటారు. క్యారెట్ లోని విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషిస్తే, విటమిన్ సి గాయాలను వేగంగా నయం చేయడానికి దోహదపడుతుంది.

పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు క్యారెట్ ఎంతో సహాయపడుతుంది. ఇందులో అధికంగా ఉండే క్యాలరీలు, విటమిన్లు మెదడు వికాసానికి కూడా తోడ్పడతాయి. రోజుకో గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

నెలసరి సరిగా రానివారు క్యారెట్ జ్యూస్ తీసుకుంటే సమస్య తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా మంచిది, ఎందుకంటే ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్స్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.

పచ్చి క్యారెట్ ను రోజు తినడం వలన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించవచ్చు. క్యారెట్ లో పొటాషియం, ఐరన్, సోడియం, మాంగనీస్, అయోడిన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక రుగ్మతల నుండి కాపాడతాయి.

శాకాహారులలో కనిపించే అనీమియా వంటి లోపాలను క్యారెట్ ద్వారా అధిగమించవచ్చు. నరాల బలహీనతకు క్యారెట్ ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. క్యారెట్ మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

ఎలాగైనా క్యారెట్ తీసుకోవచ్చు..

పటిష్టమైన దంతాలకు, బలమైన ఎముకలకు క్యారెట్ ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. వండుకొని తినడానికి ఇబ్బంది పడేవారు పచ్చిగా లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే అందులోని పోషకాలను సంపూర్ణంగా పొందవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us