WhatsApp New Feature: వాట్సాప్‌లో సర్‌ప్రైజ్ ఆప్షన్.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. కొత్త ఫీచర్‌తో మెసేజ్‌లను సైతం..

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ తన వినియోగదారులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. నిరంతరం సరికొత్త ఫీచర్ అప్‌డేట్స్ ఇస్తున్న వాట్సప్.. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను..

WhatsApp New Feature: వాట్సాప్‌లో సర్‌ప్రైజ్ ఆప్షన్.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. కొత్త ఫీచర్‌తో మెసేజ్‌లను సైతం..
Whatsapp
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 16, 2022 | 10:47 AM

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ తన వినియోగదారులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. నిరంతరం సరికొత్త ఫీచర్ అప్‌డేట్స్ ఇస్తున్న వాట్సప్.. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్.. ఇప్పుడు మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎమోజీ రియాక్షన్ నుంచి మెసేజ్ డిలీట్ చేసే సమయం పెంచడం, ఆటోమాటిక్ లాగౌట్, గ్రూప్ అడ్మిన్‌కి మెసేజ్ డిలీట్ చేసే ఆప్షన్ లాంటి అనేక ఫీచర్లను తీసుకువచ్చింది. ఈ క్రమంలో మరో ఆశ్చర్యకరమైన అప్‌డేట్ తీసుకువచ్చింది. మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌ని ఎడిట్ చేసుకోవచ్చు.

Wabetainfo ఈ కొత్త ఫీచర్ గురించిన సమాచారాన్ని వెల్లడించింది. దీని ప్రకారం.. వాట్సాప్ మెసేజ్‌లను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. వినియోగదారులు ఇతరులకు మెసేజ్ పంపినప్పుడు ఏదైనా అక్షరం తప్పు పడితే.. దానిని సవరించడానికి ఇది ఉపకరిస్తుంది. ప్రస్తుతం ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్.. మొత్తం మెసేజ్‌ను డిలీట్ చేస్తుంది. కానీ, ఈ ఎడిట్ ఆప్షన్‌లో మాత్రం తప్పుగా పంపిన మెసేజ్‌ను సరిచేసుకోవచ్చు. అక్షరాలను ఎడిట్ చేసుకుని, మళ్లీ పంపవచ్చు.

గ్రూప్ సభ్యుల పెంపు..

అలాగే, వాట్సాప్ గ్రూప్ సమస్యకు సంబంధించి కూడా కొత్త ఆప్షన్‌ను తీసుకువచ్చేందుకు రంగం సద్ధమైంది. వాట్సాప్ తన కొత్త అప్‌డేట్‌లో గ్రూప్‌ సభ్యుల సంఖ్య పరిమితిని పెంచనున్నట్లు తెలుస్తోంది. మొదట్లో వాట్సాప్ గ్రూప్‌లో 256 మంది సభ్యులను యాడ్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఆ తరువాత ఆ సంఖ్యను 512కి పెంచారు. ఇప్పుడు ఈ సంఖ్యను మరింత పెంచుతున్నారు. గ్రూప్ క్రియేషన్ కోసం సభ్యుల పరిమితిని 1024కి పెంచే పనిలో వాట్సాప్ ఉంది. ఈ ఆప్షన్ ప్రస్తుతం బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వీలైనంత త్వరగా ఈ కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది వాట్సాప్.

ఇవి కూడా చదవండి

ప్రైవసీ ఫీచర్..

గతవారం వాట్సాప్ తన ఆండ్రాయిన్ వినియోగదారుల కోసం ప్రైవసీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్‌ ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ ఆప్షన్‌ను ఎంచుకోవడానికి వాట్సాప్ అప్లికేషన్‌ను తెరిచి, పైన కుడి మూలలో ఉన్న మూడు చుక్కల గుర్తుపై క్లిక్ చేయాలి. ఆ తరువాత సెట్టింగ్‌లకు వెళ్లి, అకౌంట్, ప్రైవసీ ఆప్షన్స్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత Same as Last Seen అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అలా మీ ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..