Andhra Pradesh: మీరు ప్రకృతి ప్రేమికులా? అయితే ఏపీలోని ఈ ప్లేస్‌ను చూస్తే పరశించపోవడం ఖాయం..
ప్రకృతి రమణీయం.. కన్నులసోయగం. దట్టమైన మేఘాలు.. కమ్ముకున్న మంచు శిఖరాలు.. మేఘాన్ని ముద్దాడే కొండలు.. ఇవ్వనీ చూడాలంటే కొడైకెనాలో..
ప్రకృతి రమణీయం.. కన్నులసోయగం. దట్టమైన మేఘాలు.. కమ్ముకున్న మంచు శిఖరాలు.. మేఘాన్ని ముద్దాడే కొండలు.. ఇవ్వనీ చూడాలంటే కొడైకెనాలో.. కులుమనాలినో వెళ్లాలి. కాని ఇప్పుడా అవసరం లేదు. ఈ వార్తలో చెప్పబోయే మేఘాల స్పాట్‌కి వెళ్తే ప్రకృతి ప్రేమికులు బరువెక్కిన హృదయం ఉబ్బితబ్బిబ్బై ఆనందంతో పరవశించిపోతారు.
అవును మన ఆంధ్రప్రదేశ్ లోనే ఇలాంటి అద్భుత పర్యాటక ప్రాంతం ఏర్పడింది. అదే విశాఖ టూరిజంలో కొత్త టూరిస్ట్ స్పాట్ గా, ప్రకృతి ప్రేమికుల మనుసు దోచేస్తూ దిబెస్ట్ స్పాట్‌గా పేరొందిన వంజంగి కొండలు. ఇక్కడ పచ్చని గిరులను తాకుతూ శ్వేతవర్ణ మేఘాలు పయనించే అద్భుతమైన దృశ్యాలు ప్రకృతి ప్రేమికుల మనసును కట్టేస్తున్నాయి. ఈ అందాలను తిలకించి టూరిస్ట్‌లు ఆనందంతో తన్మయం చెందుతున్నారు.
సాధారణంగా ఇలాంటి సీన్స్ మైథలాజికల్ సినిమాల్లో చూస్తాం. డైరెక్టర్లు నారదుడు తంబుర వాయిస్తూ.. పాల కడలిలో శేషతల్పంపై విష్ణుమూర్తి పవళించిన సీన్స్ ఇలాంటి మేఘాల్లో సూట్ చేసినట్లు పెట్టి అదరహో అనిపిస్తారు. సేమ్ అలాంటి ఈ వంజంగి కొండలను ఇప్పుడు చూసేందుకు ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు క్యూ కడుతున్నారు. మరి ముఖ్యంగా శీతాకాలంలో సందర్శకుల తాకిడి వంజంగి కొండలకు ఎక్కువగా ఉంటుంది. పర్యాటకులందరూ పాడేరులో బస చేసి వేకువజామున వంజంగి మేఘాల కొండలను చూసేందుకు బయలుదేరతారు.
విశాఖపట్నం నుంచి వంద కిలో మీటర్ల దూరంలో ఉంది వంజంగి హిల్స్. ఏడాది వ్యవధిలోనే సుమారు 2 లక్షలకు పైగానే పర్యాటకులు వంజంగి హిల్స్‌ను సందర్శించారు. ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా మీ ప్యామిలీతో వెళ్లి చూసేయ్యండి వంజంగి హిల్స్ అందాలను చూసి తరించండి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..