AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ‘అతన్ని మాత్రం ఏం అనొద్దు’.. ప్రేమికుడు దక్కడని యువతి ఆత్మహత్యాయత్నం..

ప్రేమించిన వ్యక్తి దక్కలలేడన్న మనోవేదనతో యువతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది.

Andhra Pradesh: ‘అతన్ని మాత్రం ఏం అనొద్దు’.. ప్రేమికుడు దక్కడని యువతి ఆత్మహత్యాయత్నం..
Girl Suicide
Shiva Prajapati
|

Updated on: Oct 14, 2022 | 9:06 AM

Share

ప్రేమించిన వ్యక్తి దక్కలలేడన్న మనోవేదనతో యువతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. నారాయణపురం గ్రామానికి చెందిన నిచ్చిత అనే నర్సింగ్ విద్యార్థిని అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. అయితే.. యువకుడి ఇంట్లో వీరి పెళ్లి విషయం ఇష్టం లేదని తెలుస్తోంది. ఎప్పటికైనా తాను ప్రేమించిన వ్యక్తి తనకు దక్కే పరిస్థితి లేదన్న బెంగతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలోనే ప్రేమించిన వ్యక్తి తప్పులేదని, అతనిని ఏమి అనద్దొంటూ సూసైడ్‌ లేఖ రాసింది. అతనిపై కేసులు ఏమీ పెట్టొద్దని వేడుకుంది. అటు తర్వాత మత్తు ఇంజిక్షన్లు తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీన్ని గమనించిన బంధువులు ఆస్పత్రిలో చేర్చారు. వైద్యలు బాధితురాలికి చికిత్స చేస్తున్నారు. గతంలో కూడా ఓ సారి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే.. పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అయినా మారకుండా మరో మారు ఈప్రయత్నం చేసింది. యువతి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..