Kerala ‘human sacrifice’ case: కేరళ నరబలుల కేసులు సంచలన నిజాలు.. పోలీసులే వణికిపోయారు..
కేరళ ఎలంతూర్ జంట హత్యల కేసులో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సంచలనం రేపిన ఈ ఘటనలో మృతుల శరీర భాగాల్ని నిందితులు..
కేరళ ఎలంతూర్ జంట హత్యల కేసులో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సంచలనం రేపిన ఈ ఘటనలో మృతుల శరీర భాగాల్ని నిందితులు వండుకుని తిన్నట్లు తెలిసిందే. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని మాంత్రికుడు రషీద్ అలియాస్ మహ్మద్ షఫీ చెప్పిన మాటలతో ఈ నేరం చేసిన తీరును భగవల్ సింగ్-లైలా దంపతులు పోలీసులకు వివరించారు. సీసీటీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్ టవర్ లొకేషన్స్ సహాయంతో నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వాళ్ల నుంచి కళ్లు బైర్లు కమ్మే నిజాలు రాబట్టారు.
దిమ్మతిరిగే నిజాలు..
లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవనం సాగించే పద్మను సెప్టెంబరులో ఎర్నాకుళం నుంచి, రోస్లిన్ ను జూన్ నెలలో రషీద్ ఎలంతూర్‌లో భగవల్ సింగ్ దంపతుల నివాసానికి తీసుకువచ్చాడు. తనతో శృంగారంలో పాల్గొంటే 15 వేలు ఇస్తానని ఒకరిని, నీలి చిత్రాల్లో నటిస్తే 10 లక్షలు ఇస్తానని మరొకరిని బుట్టలో వేసుకుని తన వెంట రప్పించుకున్నాడు.
నమ్మి వచ్చిన ఆ ఇద్దరిని సింగ్ దంపతులతో కలిసి బలి ఇచ్చాడు. రషీద్ సూచనల మేరకు పద్మను 5 ఖండాలుగా, రోస్లిన్‌ను 56 ముక్కలుగా చేశారు. ఆ శరీరభాగాల్లో కొన్నింటిని వండుకుని ముగ్గురూ తిన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మరికొంత మందిని నరబలి ఇవ్వాలని నిందితులు ప్లానేసినట్టు విచారణలో తేలింది. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ నరబలుల కేసులో తొలి క్లూ ఎలా లభించిందనే విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
ఆ కుటుంబం ఏమయ్యిందో తెలియదు..
గతంలో తిరువళ్లకు చెందిన ఓ మహిళను నరబలి కోసం షఫీ తీసుకొచ్చాడు. తాను ఎక్కడుందన్న వివరాల్ని ఆమె కుటుంబసభ్యులకు చెప్పింది. ఆమెను చంపితే దొరికిపోవడం ఖాయమని భయపడిన నిందితులు.. నరబలి ఆలోచనను విరమించుకున్నారు. అలానే ఓ చిన్నారి సహా కుటుంబాన్ని కూడా షఫీ నరబలి కోసం భగవల్-లైలా ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఆ ఫ్యామిలీ ఎవరు, ఏమయ్యారనే దానిపై స్పష్టత లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..