Cobra snake: వామ్మో.. షూలో దాగిన నాగు పాము.. తృటిలో తప్పించుకున్నారు.. వీడియో చూస్తే వణుకే..!

ఓ చోట ఓ భారీ నాగుపాము స్థానికులకు ఊహించని షాక్‌ ఇచ్చింది. ఆ కోబ్రా ఒక్క‌సారిగా షూ నుంచి ప‌డ‌గ విప్పిన తీరు కూడా భయంతో వణికిపోయేలా చేసింది.

Cobra snake: వామ్మో.. షూలో దాగిన నాగు పాము.. తృటిలో తప్పించుకున్నారు.. వీడియో చూస్తే వణుకే..!
Cobra Snake
Follow us

|

Updated on: Oct 13, 2022 | 1:44 PM

వర్షాలు, వరదల కారణంగా పాములు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఇటీవల పాములకు సంబంధించిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో పాములు ఇంట్లోని ఫ్రిజ్‌ల్లోకి కూడా దూరేస్తున్నాయి. కొన్ని సార్లు కోళ్ల గూడులో, మరికొన్ని చోట్ల వంటపాత్రల్లో కూడా పాములు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా..ఓ చోట ఓ భారీ నాగుపాము స్థానికులకు ఊహించని షాక్‌ ఇచ్చింది. ఇంకా నయం వారు తృటిలో పాముకాటుతో తప్పించుకోగలిగారు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో జరిగింది. వెచ్చగా ఉందనకుందేమో..ఓ కోబ్రా ఏకంగా కాళ్లకు వేసుకునే షూలో నక్కి సేదతీరుతోంది. విషయం తెలుసుకుని వచ్చిన స్నేక్‌ క్యాచర్‌ని ముప్పు తిప్పలు పెట్టింది. ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. షూ వేసుకునేందుకు చూసిన వ్యక్తికి…లోపల పాముని చూసి ఒక్కసారిగా షాక్‌ తిన్నంతపనైంది. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం…

ఈ వీడియో చూస్తే నిజంగా భయంతో వణికిపోతారు. ఓ నాగు పాము షూలో దాగి ఉన్న ఘ‌ట‌న‌ క‌ర్నాట‌క‌లోని మైసూర్‌లో వెలుగు చూసింది. ఆ కోబ్రా ఒక్క‌సారిగా షూ నుంచి ప‌డ‌గ విప్పిన తీరు కూడా షాక్‌కు గురి చేస్తుంది. మైసూర్‌లోని ఓ వ్య‌క్తి షూ తొడుక్కునేందుకు వెళ్లాడు. అయితే ఆ షూలో దాగిన పామును చూసి షాక‌య్యాడు. అత‌ను వెంట‌నే స్నేక్ క్యాచ‌ర్‌కు ఫోన్ చేశాడు. పాములు ప‌ట్టేవాడు వ‌చ్చి త‌న వ‌ద్ద ఉన్న హుక్‌తో షూను క‌దిలించాడు. ఆ స‌మ‌యంలో షూలో చుట్టుకున్న ఆ విష‌స‌ర్పం చాలా వేగంగా ప‌డ‌గ విప్పుతూ పైకి లేచింది. ఇదంతా వీడియో తీశారు. ట్విట్ట‌ర్‌లో పోస్టు అయిన ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

రెస్క్యూ చేస్తున్నప్పుడు సిబ్బంది చూసేవారిని జాగ్రత్తగా ఉండాలని, షూ ధరించే ముందు వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. వర్షాకాలంలో పాములు ఎక్కడ ఎప్పుడు ప్రత్యక్షమవుతాయో కూడా చెప్పలేమంటున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిందే… శిక్షణ పొందిన సిబ్బంది సహాయం తీసుకోవాలంటూ..IFS అధికారి వీడియోను పోస్ట్ చేస్తూ రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?