Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dark chocolate Maggi: డార్క్‌ చాక్లెట్‌తో మ్యాగీ తయారీ.. రంగు, రుచి టెస్ట్‌ చేయాలంటే.. ఈ వీడియో చూడాల్సిందే..

మ్యాగీ షేక్ నుంచి ర‌స్‌గుల్లా చాట్ వ‌ర‌కూ వింతైన కాంబినేష‌న్స్‌తో కూడిన ఫుడ్ వీడియోలు ఇంట‌ర్‌నెట్‌ను షేక్ చేయ‌గా తాజాగా మరో వైర‌ల్ వీడియోలో డార్క్ చాక్టెట్‌ విత్‌ మ్యాగీ తయారు చేసిన వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Dark chocolate Maggi: డార్క్‌ చాక్లెట్‌తో మ్యాగీ తయారీ.. రంగు, రుచి టెస్ట్‌ చేయాలంటే.. ఈ వీడియో చూడాల్సిందే..
Dark Chocolate Maggi
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 13, 2022 | 12:16 PM

సోష‌ల్ మీడియాలో పాపులారిటీ కోసం చాలా మంది చిత్ర విచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. చిరాకు పుట్టించే స్టంట్స్‌, చూస్తేనే కడుపులో తిమ్మేలా కనిపించే వంటకాలకు సంబంధించి వీడియోలు చేస్తుంటారు. అలాంటి కొంద‌రు పోస్ట్ చేసే వీడియోలు చిరాకు తెప్పిస్తుంటాయి. మ్యాగీ షేక్ నుంచి ర‌స్‌గుల్లా చాట్ వ‌ర‌కూ వింతైన కాంబినేష‌న్స్‌తో కూడిన ఫుడ్ వీడియోలు ఇంట‌ర్‌నెట్‌ను షేక్ చేయ‌గా తాజాగా మరో వైర‌ల్ వీడియోలో డార్క్ చాక్టెట్‌ విత్‌ మ్యాగీ తయారు చేసిన వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మనకు ఇష్టమైన ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను పాలలో వండి, డార్క్ చాక్లెట్‌తో అలంకరించి ఉంచినట్లు చూపించే మ్యాగీ రెసిపీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక సాధారణ వంటకం.. తయారీ ప్రక్రియలో ఇలా పాడైపోయిందంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మ్యాగీని ఇష్టపడే వ్యక్తులు ‘డార్క్ చాక్లెట్ మ్యాగీ’ రెసిపీకి తమ ఫన్నీ రియాక్షన్‌లను పంచుకుంటున్నారు. కొందరు తయారీ విధానాన్ని చూడకుండా ప్రయత్నిస్తున్నారు. మీరు ఈ ప్రత్యేకమైన మ్యాగీ రెసిపీని ప్రయత్నించాలనుకుంటున్నారా? వైరల్ మేకింగ్ వీడియోను చూడండి..మీరే నిర్ణయించుకోండి.

సోషల్ మీడియాలో వింత ఫుడ్ వీడియోలకు కొదవలేదు. డార్క్ చాక్లెట్ మ్యాగీ అనేది ఇంటర్నెట్ అసహ్యించుకునే లాంగ్ లైన్ ఫుడ్ రెసిపీ వీడియోలలో తాజాగా ప్రవేశించింది. తయారీ ప్రక్రియలో మ్యాగీని నీటిలో కాకుండా పాలలో ఉడకబెట్టారు. మ్యాగీ మెత్తబడిన తర్వాత అందులో డార్క్ చాక్లెట్‌ను కలిపేశారు. ఇది మ్యాగీ రంగును చాక్లెట్ రంగుగా మార్చడమే కాకుండా, దాని రుచిని కూడా ప్రభావితం చేస్తుంది. తయారీదారు ఈ వంటకాన్ని వండిన తర్వాత ఆస్వాదించడం, వారి ముఖంపై ఫన్నీ రియాక్షన్‌ని చూపించటం కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

మ్యాగీ వీడియోపై నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్ షేర్ చేస్తున్నారు. హాట్ చాక్లెట్‌లో తయారు చేసిన ప్రత్యేకమైన మ్యాగీ రిసిపి సోషల్ మీడియాలో చాలా కామెంట్లను ఆకర్షిస్తోంది. కొందరు దీన్ని ప్రయత్నించాలని తమ కోరికను వ్యక్తం చేయగా, మరికొందరు సులువుగా,రుచిగా ఉండే మ్యాగీ కోసం ఇలాంటివి చేయకూడదని అన్నారు. రెసిపీ వీడియోపై స్పందిస్తూ, ఒక సోషల్ మీడియా వినియోగదారు, ఆహారాన్ని వృధా చేయ కూడదని తెలియదా అంటూ ప్రశ్నించారు. మరో నెటిజన్‌ స్పందిస్తూ.. మ్యాగీని వదిలేయండి.. ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి