Boys fight: కోచింగ్ సెంటర్‌లో స్టూడెంట్స్ ఫైట్.. కారణం రష్యా-ఉక్రెయిన్ యుద్దం కన్నా పెద్ద విషయమే..!
ఆవేశంతో ఊగిపోతూ ఒకరినొకరు తన్నుకోవడం, కొట్టుకోవడం వీడియోలో చూడవచ్చు. వీడియో క్యాప్షన్ అబ్బాయిల మధ్య వివాదానికి కారణం ఎంటన్నది వివరణ ఇచ్చారు.
కోచింగ్ సెంటర్‌లో ఇద్దరు స్టూడెంట్స్ రెచ్చిపోయి కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు కలబడుతూ.. పాశవికంగా పోరాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. వారి సహవిద్యార్థులు వారిని వద్దని వారించినా వినలేదు. ఆవేశంతో ఊగిపోతూ ఒకరినొకరు తన్నుకోవడం, కొట్టుకోవడం వీడియోలో చూడవచ్చు. వీడియో క్యాప్షన్ అబ్బాయిల మధ్య వివాదానికి కారణం ఎంటన్నది వివరణ ఇచ్చారు. కోచింగ్ ఇనిస్టిట్యూట్ వద్ద ఇద్దరు యువకుల ఘర్షణకు కారణం.. అమ్మాయి అని తెలిసింది. వీడియోను పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ట్విట్టర్ లో చర్చకు దారితీసింది. ఆ వీడియోలో ఇద్దరు కొట్టుకుంటుడగా.. పక్కనున్న వారు కూడా ఎంకరేజ్ చేశారు. అంతలో క్లాస్ టీచర్ రావడంతో విషయం తెలిసింది. టీచర్ పెద్ద మనిషిగా ప్రవర్తించి.. గొడవను సద్దుమణిగేలా చేశారు. కానీ ఆ వీడియో మాత్రం తెగ తిరుగుతుంది.
వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో వైరల్ క్లిప్ ట్విట్టర్‌లో చర్చకు దారితీసింది. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, “ఇది రష్యా-ఉక్రెయిన్ వివాదం కంటే తీవ్రమైనది. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు. ఇతర అబ్బాయిలు జోక్యం చేసుకునే బదులు పోరాటాన్ని ఎలా చిత్రీకరిస్తున్నారనేది మరింత ఆందోళన కలిగించే అంశం. అక్కడ స్నేహితులు కూడా ఉంటారని, కనీసం వారు కూడా గొడవను ఆపకుండా చోద్యం చూడటం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kalesh Over Girls In Allen Institute pic.twitter.com/WTtfTW7B71
— r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 11, 2022
కొంతమంది వ్యక్తులు వాగ్వాదానికి యువకులను విమర్శిస్తే, మరికొందరు జోక్యం చేసుకోకుండా ప్రోత్సహించడం ఎంత సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకోవడానికి కోచింగ్ సెంటర్లకు పంపితే ఇలా చేస్తారా అంటూ మండిపడుతున్నారు. మరీ ఆ ఇనిస్టిట్యూట్ ఏం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . అవును నిజమే..ఇదీ రష్యా- ఉక్రెయిన్ యుద్దం కన్నా పెద్ద విషయమే అంటున్నారు. మిగతా వారు ఎందుకు కల్పించుకోలేదని మరొకరు అడిగారు. ఇదీ న్యూటన్ థర్డ్ లా అని మరొకరు సెటైర్ వేశారు. ఇదీ డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ అని.. ఇంజినీరింగ్, నీట్ కన్నా.. దానికే వారు పనికొస్తారని రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి