AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Squirrel: పార్క్‌లో ఒంటరిగా బంతితో ఆడుతున్న ఉడుత.. అందమైన వీడియోకి నెటిజన్లు అందరూ ఫిదా

అందమైన చిన్న జీవులలో ఉడుత కూడా ఒకటి. ఉడత పరిగెత్తడం,చెట్లు ఎక్కడం మీరు తరచుగా చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా బంతితో ఆడటం చూసారా?

Squirrel: పార్క్‌లో ఒంటరిగా బంతితో ఆడుతున్న ఉడుత.. అందమైన వీడియోకి నెటిజన్లు అందరూ ఫిదా
Squirrel Plays
Jyothi Gadda
|

Updated on: Oct 13, 2022 | 11:30 AM

Share

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. పాములు, ఏనుగులు, పులులు, సింహాలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. కుక్కలు పిల్లులకు సంబంధించిన వీడియోలను ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇక జంతువులు చేసే చిత్ర విచిత్రమైన పనులు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియోలు చూసినప్పుడు మనసుకు ఉల్లాసంగా, తేలికగా అనిపిస్తుంది. ఎంతటి ఒత్తిడినైనా ఇట్టే మాయం చేస్తుంటాయి. ఇకపోతే, జంతువులను ఇష్టపడే వ్యక్తులు వాటికి సంబంధించిన ప్రతి చిన్న విషయంపై చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ వీడియో మీ మానసిక స్థితిని పూర్తిగా రిఫ్రెష్ చేస్తుంది..అలాంటి వీడియో తాజాగా ఇంటర్‌నెట్‌లో బాగా హల్‌చల్‌ చేస్తోంది. ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోని మీరు కూడా ఇష్టపడతారు. చాలా అందమైన చిన్న జీవులలో ఉడుత కూడా ఒకటి. ఉడత పరిగెత్తడం,చెట్లు ఎక్కడం మీరు తరచుగా చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా బంతితో ఆడటం చూసారా? చూడకపోతే గనుక ఉడత బంతితో ఆడుకుంటున్న ఈ వీడియో తప్పక చూడండి.

ట్విట్టర్‌లో ఒక వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది. దీనిలో ప్లేజోన్ వీడియోలో ఒక ఉడుత దాని పరిమాణం కంటే చిన్న బంతితో ఆడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూడటం వలన మీ షెడ్యూల్‌ మార్చేస్తుంది.ఈ ఉడత చిలిపి చేష్టలు మీ ముఖంలో చిరునవ్వును తెస్తాయి. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో సరదాగా నిండిన స్వీట్ వీడియోలో, నీలిరంగు బంతితో ఆడుకుంటున్న అందమైన నల్లని ఉడుతను మీరు చూశారు. వీడియోను మీరు లూప్‌లో అనేకసార్లు చూడగలిగేలా ఉంది. ఈ వీడియోను ట్విటర్‌లో “buitengebieden” భాగస్వామ్యం చేసారు, దీనికి 1.7 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు, వారు తమ వీడియోలను పోస్ట్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇటీవలే షేర్ చేయబడింది. ఇప్పటివరకు 10 లక్షల కంటే ఎక్కువ వ్యూస్‌ని సాధించింది. అయితే ఇది 38 వేలకు పైగా లైక్‌లు, వేల కామెంట్‌లను కూడా సంపాదించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కారణం ఇదే.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి