Watch Video: పొరపాటున కూడా మీరు ఇలా చేయకండి.. ప్రాణం తీసిన స్టంట్.. వైరల్ అవుతున్న వీడియో..

ఈ మధ్యకాలంలో రీల్స్ మోజులో పడి చాలా మంది యువకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంతకు ముందు సెల్ఫీల పిచ్చి ప్రాణాలను బలిగొంటే..

Watch Video: పొరపాటున కూడా మీరు ఇలా చేయకండి.. ప్రాణం తీసిన స్టంట్.. వైరల్ అవుతున్న వీడియో..
Youth Train Stunt
Follow us

|

Updated on: Oct 13, 2022 | 11:46 AM

ఈ మధ్యకాలంలో రీల్స్ మోజులో పడి చాలా మంది యువకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంతకు ముందు సెల్ఫీల పిచ్చి ప్రాణాలను బలిగొంటే, ఇప్పుడు రీల్స్ పిచ్చి ఊపిరి తీస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో షాకింగ్ వీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువకుడు స్పీడ్‌గా ప్రయాణిస్తున్న రైలులో ఫుట్‌పాత్ వద్ద నిల్చుని స్టంట్స్ చేశాడు. కొంత సేపు బాగానే ఉన్నప్పటికీ.. చివరకు అతని ఏమరపాటు అతని ప్రాణాలను బలిగొంది.

పంజాబ్‌లోని చావా రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన భయానకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు ట్రైన్ ఎంట్రన్స్ ఫుట్‌పాత్ వద్ద నిల్చున్నాడు. అక్కడ ఉన్నొడుకు కుదురుగా ఉంటేనే.. డోర్‌ వద్ద ఉండే రెండు గ్రిల్స్ పట్టుకుని బయటకు వేలాడాడు. ట్రైన్ స్పీడ్‌గా వెళ్తుండగా మధ్య మధ్యలో వచ్చే కరెంట్ పోల్స్ తగలకుండా గేమ్ ఆడుతున్నాడు. అయితే, కాసేపు అతని ఆట సాగింది. కానీ, ఓచోట సీన్ రివర్స్ అయ్యింది. అతను చేసిన చిన్న ఏమరపాటు అతని ప్రాణాలు బలిగొంది. డోర్ బయటకు వేలాడిన యువకుడికి ఎదురుగా వచ్చిన కరెంట్‌ పోల్‌ బలంగా దెబ్బంది. ఆ ధాటికి అతను ట్రైన్ నుంచి పడిపోయాడు. ఈ ఘటనలో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. మరణించిన వ్యక్తిని ఇంకా గుర్తించలేదని తెలిపారు. ఈ ఘటన సామ్రాలా సమీపంలోని చాలా రైల్వే స్టేషన్ దగ్గర మాల్వా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా జరిగినట్లు తెలిపారు. 17 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ మధ్య కాలంలో యువతకు కాస్త అల్లరి చేష్టలు ఎక్కువ అయ్యాయనే చెప్పాలి. వారి అతి వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. తాజాగా ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. యువత ఇలా చేష్టలు చేయొద్దని, ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్స్ చేయొద్దని సూచిస్తున్నారు అధికారులు. ఇలాంటి ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. యువత తస్మాత్ జాగ్రత్త. జీవితం ఎంతో విలువైనది. స్వల్పకాలిక ఆనందం కోసం జీవితాలను పణంగా పెట్టడం సరికాదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే