Astam Oraon: ఆ ఫ్యామిలీలో అక్కాచెల్లెళ్లు క్రీడాకారులు.. కూతురు పేరుతో రోడ్డు నిర్మాణం.. కూలీలుగా అష్టమ్ తల్లిదండ్రులు..

జార్ఖండ్‌కు చెందిన అష్టమ్‌ ఉరాన్ గుమ్లా జిల్లాలోని ఓ మారూమూల గ్రామం. ఆమె తల్లిదండ్రులకు అయిదుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. అత్యంత పేదరికంలో పుట్టినా ఫుట్‌బాల్‌పై మక్కువతో కష్టాలను ఇష్టంగా ఎదుర్కొంది.

Astam Oraon: ఆ ఫ్యామిలీలో అక్కాచెల్లెళ్లు క్రీడాకారులు.. కూతురు పేరుతో రోడ్డు నిర్మాణం.. కూలీలుగా అష్టమ్ తల్లిదండ్రులు..
Astam Oraon
Follow us

|

Updated on: Oct 13, 2022 | 11:23 AM

మన దేశంలో క్రీడల పరిస్థితి అదృష్ట, దురదృష్టాలపై ఆధారపడి ఉంటుందేమో.. కొంతమంది తమ ప్రతిభతో పేరు ప్రఖ్యాతలతో పాటు.. ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందుకుంటూ ఓ రేంజ్ లో వెలుగొందుతారు. అయితే మరికొందరి క్రీడాకారులు మాత్రం.. తమ ప్రతిభతో ఆటకు వన్నె తెచ్చి.. దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినా.. పూట గడవని స్థితిలో గడిపేస్తూ ఉన్నవారు ఎందరో ఉన్నారు.  అయితే కొన్ని క్రీడలకు.. కొంతమంది క్రీడాకారులకు మాత్రమే తగినంత ప్రోత్సాహం లభిస్తుంది అంతే.. తాజాగా ఆటతో ఖ్యాతిగాంచిన ఓ క్రీడాకారుడిని జీవితంతో పాటు.. మన దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో తెలియజేసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె పేరు మీదే రోడ్డు నిర్మించే స్థాయిలో కూతురుకు పేరు వచ్చింది.. దౌర్భాగ్యం ఏమిటంటే.. ప్రభుత్వం నిర్మిస్తున్న ఆ రోడ్డు పనుల్లో ఆమె తల్లిదండ్రులే కూలీలుగా చేరారు. నిజానికి తమ కడుపున పుట్టిన పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలని.. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకు తమ శక్తికి మించి కష్టపడతారు. తమ పిల్లలు సమాజంలో ఓ రేజ్ కు చేరుకున్న తర్వాత తల్లిదండ్రులు అన్నేళ్లు పడిన కష్టాలను మరిచిపోతారు. ఇలాగే జార్ఖండ్‌లో ఓ కుటుంబం తమ కూతురు సాధించిన ఘనతకు పొంగిపోతున్నారు. అయితే కూతురికి వచ్చిన పేరు.. వారి తలరాతను మార్చలేదు. ఆర్ధిక కష్టాల నుంచి ఇంకా గట్టెక్కించలేదు.

క్రీడా రంగంలో ముఖ్యంగా ఫుట్ బాల్ క్రీడాకారిణి అష్టమ్ ఒరాన్.. పేరు తెలియని వారుండరు. మహిళల ఫిఫా ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించిన జార్ఖండ్ యువతి. అత్యంత పేదరిక కుటుంబంలో పుట్టింది. పూట గడవడమే కష్టంగా ఉన్నా తన కలను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడింది. ఎంత కష్టమైనా సరే ఫుట్‌ బాల్ నేర్చుకుని.. ఆ రంగంలో సత్తా చాటుకుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌ పోటీల్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తోంది. అయితే ఆ తల్లిదండ్రులకు తమ కుమార్తె ఆటను  వీక్షించడానికి ఇంట్లో టీవీ లేదు. అంతేకాదు.. మారుమూలగా ఉన్న వారి గ్రామానికి సరైన రహదారి కూడా లేదు.

ఈ విషయం మీడియా ద్వారా అధికారుల దృష్టికి చేరుకుంది. వెంటనే అధికారులు అష్టమ్ ఒరాన్ కుటుంబానికి ఓ టీవీని కానుకగా ఇచ్చారు. అంతేకాదు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడానికి సంకల్పించారు. గౌరవసూచకంగా ఊరికి రహదారిని వేసేందుకు పనులు ప్రారంభించారు. అయితే ఇక్కడ విషాదమేంటంటే తమ కూతురు పేరుతో నిర్మిస్తున్న ఆ రహదారి పనులకు కూలీలుగా ఆమె తల్లిదండ్రులు పనిచేయడమే. పొట్టకూటి కోసం దినసరి కూలీలుగా ఆ రహదారి పనుల్లో పాల్గొంటున్నారు. కూలీలుగా పనిచేస్తూ మట్టిని తవ్వి ఎత్తిపోస్తున్నారు. పూట గడవాలంటే తాము పని చేయక తప్పట్లేదంటున్నారు.

ఇవి కూడా చదవండి

జార్ఖండ్‌కు చెందిన అష్టమ్‌ ఉరాన్ గుమ్లా జిల్లాలోని ఓ మారూమూల గ్రామం. ఆమె తల్లిదండ్రులకు అయిదుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. అత్యంత పేదరికంలో పుట్టినా ఫుట్‌బాల్‌పై మక్కువతో కష్టాలను ఇష్టంగా ఎదుర్కొంది. కృషి పట్టుదలతో ఫుట్ బాల్ లో ప్రావీణ్యం సంపాదించుకుంది. ఇప్పుడు  భారత జట్టులో స్థానం సంపాదించి కెప్టెన్‌గా ఎదిగింది. అయితే అష్టమ్ మాత్రమే కాదు… ఆమె  విచిత్రమేమిటంటే అష్టమ్ అక్క, చెల్లెళ్లు కూడా క్రీడాకారులే. అష్టమ్ అక్క సుమీనా ఓరాన్ జాతీయ స్థాయి డిస్కస్ త్రో అథ్లెట్. చెల్లెలు అల్కా ఇంద్వార్ అండర్ 16 ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారిణి. తమ్ముడు చదువుకుంటున్నాడు. కుటుంబంలో పిల్లలు మంచి క్రీడాకారులుగా ఎదిగారు కానీ.. వారి కుటుంబ ఆర్థిక స్థితిలో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో అష్టమ్‌ ఉరాన్ ఫ్యామిలీకి కష్టాలు తప్పడం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles