AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inflation Rate: సామాన్యులకు షాక్.. సెప్టెంబర్‌లో భారీగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. 7.41 శాతానికి చేరిక

రిటైల్ ద్రవ్యోల్బణంపై అధికారిక గణాంకాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ సంఖ్య వినియోగదారుల ధరల సూచిక అంటే CPI ఆధారంగా విడుదల చేయబడింది. సెప్టెంబర్‌లో సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 7.41%. సరిగ్గా ఏడాది క్రితం, సెప్టెంబర్ 2021లో ఈ రేటు 4.35 శాతంగా ఉంది.

Inflation Rate: సామాన్యులకు షాక్.. సెప్టెంబర్‌లో భారీగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. 7.41 శాతానికి చేరిక
Inflation Rate
Surya Kala
|

Updated on: Oct 13, 2022 | 8:53 AM

Share

సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం నేపథ్యంలో సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతానికి చేరుకుంది. ఆగష్టు నుంచి సెప్టెంబర్‌ కి ఇది 0.41 శాతం పెరిగింది. ఆగష్టు లో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంది. ఏప్రిల్ తర్వాత ద్రవ్యోల్బణంలో ఇదే అతిభారీ పెరుగుదల. ఆహార పదార్థాల ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల కనిపించింది.

సెప్టెంబర్ నెల వరుసగా తొమ్మిదో నెలలో కూడా రిజర్వ్ బ్యాంక్ అంచనాల కంటే ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం రేటును (టాలరెన్స్ రేట్) 6 శాతంగా నిర్ణయించింది. అయితే గత కొన్ని నెలలుగా ఈ రేటు దాదాపు 7 శాతంగా ఉంది. ఇటీవల, రిజర్వ్ బ్యాంక్ ఈ రేటుపై ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వ్ బ్యాంక్ తన రెపో రేటును రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగా మాత్రమే పెంచుతుంది. ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగితే రిజర్వ్ బ్యాంక్ మళ్లీ రెపో రేటును పెంచాల్సి ఉంటుంది. దీని కారణంగా రుణాలపై వడ్డీ రేట్లు సహా EMI లపై కూడా వడ్డీ రేటుపై ప్రభావం పడనుంది.

ఆగస్టు కంటే ఎక్కువ ద్రవ్యోల్బణం రిటైల్ ద్రవ్యోల్బణంపై అధికారిక గణాంకాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ సంఖ్య వినియోగదారుల ధరల సూచిక అంటే CPI ఆధారంగా విడుదల చేయబడింది. సెప్టెంబర్‌లో సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 7.41%. సరిగ్గా ఏడాది క్రితం, సెప్టెంబర్ 2021లో ఈ రేటు 4.35 శాతంగా ఉంది. ఆగష్టులో ఈ రేటు 7 శాతంగా ఉంది. ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఈ ద్రవ్యోల్బణం వెనుక అసలు కారణమని చెబుతున్నారు. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం ఆగస్టులో 7.62% నుంచి సెప్టెంబర్‌లో 8.60 శాతానికి పెరిగింది.

ఇవి కూడా చదవండి

పరిమితి మించి 6 శాతం పెరిగిన

ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే ఉన్నందున.. 2 శాతం వ్యత్యాసంతో ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద నియంత్రించడంలో విఫలమైన కారణాలను వివరిస్తూ ఆర్‌బిఐ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం వరకు ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకును కోరింది. కానీ దాని రేటు 7% మరియు అంతకంటే ఎక్కువ ఉంది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా.. దీని ప్రభావం ఆర్థికాభివృద్ధిపై కనిపిస్తుంది. ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం విదేశాల నుంచి అధిక దిగుమతులు..  అదీ విదేశాల నుండి దిగుమతి చేసుకున్న అధిక ధరలకు వస్తువులను దిగుమతులు చేసుకోవడం వలన ద్రవోల్బణం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అనేక రంగాలలో ద్రవ్యోల్బణం తగ్గినా.. ఆహార పదార్థాలు, ఇంధన రంగాలలో మాత్రం ద్రవ్యోల్బణం పెరుగుదలను చూస్తోంది. గత తొమ్మిది నెలలుగా రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.

IIPలో తగ్గుదల మరోవైపు ఆగస్టులో దేశ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 0.8 శాతం క్షీణించింది. ఏడాది క్రితం ఇదే నెలలో పారిశ్రామికోత్పత్తి 13 శాతం పెరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) బుధవారం విడుదల చేసిన పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP) డేటా నుండి ఈ సమాచారం పొందబడింది. డేటా ప్రకారం, ఆగస్ట్ 2022లో తయారీ రంగం ఉత్పత్తి 0.7 శాతం తగ్గిపోయింది. ఇది కాకుండా, ఈ కాలంలో మైనింగ్ ఉత్పత్తి 3.9 శాతం క్షీణించగా, విద్యుత్ ఉత్పత్తి 1.4 శాతం పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..