Viral News: మరణించాడని వృద్ధుడి పెన్షన్ నిలిపిన ప్రభుత్వం.. నేను నా డెత్ సర్టిఫికెట్ పోగొట్టుకున్నా అంటూ యాడ్.. దేశంలో ఏదైనా సాధ్యమే అంటూ..
102 ఏళ్ల వృద్ధుడి వృద్ధాప్య పెన్షన్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. అతను చనిపోయినట్లు ప్రకటించారు. అయితే తాను ఇంకా జీవించే ఉన్నానని నిరూపించుకోవడానికి ప్రత్యేకమైన మార్గంలో DC కార్యాలయానికి చేరుకున్నాడు ఆ వృద్ధుడు
Funny Ad Viral: ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే సదరు వ్యక్తుల మరణ ధృవీకరణ పత్రాన్ని అధికారులు ఇస్తారు. అయితే కొంతమంది సజీవంగా ఉన్నా.. ప్రభుత్వ లెక్కల్లో సదరు వ్యక్తులు చనిపోయినట్లు ప్రకటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ప్రజలు తాము ఇంకా జీవించే ఉన్నామని నిరూపించుకోవడానికి సుదీర్ఘ పోరాటం చేయవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో డెత్ సర్టిఫికెట్ విషయంలో హర్యానాలో చోటు చేసుకున్న ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది. 102 ఏళ్ల వృద్ధుడి వృద్ధాప్య పెన్షన్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. అతను చనిపోయినట్లు ప్రకటించారు. అయితే తాను ఇంకా జీవించే ఉన్నానని నిరూపించుకోవడానికి ప్రత్యేకమైన మార్గంలో DC కార్యాలయానికి చేరుకున్నాడు ఆ వృద్ధుడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫన్నీ ప్రకటన వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు.
ఈ వైరల్ ప్రకటనలో, ఒక వ్యక్తి తన మరణ ధృవీకరణ పత్రాన్ని కోల్పోయినట్లు పేర్కొన్నాడు. అంతేకాదు.. అతను తన సర్టిఫికేట్ ఎప్పుడు, ఎక్కడ పోగొట్టుకున్నాడో కూడా వివరాలను స్థలం, సమయంతో సహా చెప్పాడు. ఈ ప్రకటన ఒక ప్రముఖ వార్తాపత్రికలో వెలువడింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ యాడ్ ను చూసి ప్రజలు సంతోషపడుతున్నారు. తాను 7 సెప్టెంబర్ 2022న ఉదయం 10 గంటలకు లుమ్‌డింగ్ బజార్‌లో తన మరణ ధృవీకరణ పత్రాన్ని పోగొట్టుకున్నాను’ అని యాడ్‌లో పేర్కొన్నాడు సదరు వృద్ధుడు.
విశేషమేమిటంటే, ఈ యాడ్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, సర్టిఫికేట్ సీరియల్ నంబర్ కూడా పేర్కొన్నాడు. ఈ ప్రకటన రంజిత్ కుమార్ చక్రవర్తి పేరు మీద వెలువడింది. అంటే తన మరణ ధృవీకరణ పత్రాన్ని తానే పోగొట్టుకున్నా అంటూ అతడు ప్రకటన వేయించారు. మరి జీవించిన వ్యక్తి.. చనిపోయిన తర్వాత ఇచ్చే డెత్ సర్టిఫికెట్ ను ఎలా పోగొట్టుకుంటాడని ఆలోచిస్తున్నారు. ఫన్నీగా ఉందంటూ నవ్వుకుంటున్నారు.
ఈ ఫన్నీ యాడ్‌ను ఐపిఎస్ అధికారి రూపిన్ శర్మ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఒక్క భారతదేశంలో మాత్రమే జరుగుతాయి అనే క్యాప్షన్‌లో కూడా ఈ పోస్ట్ కు ఇచ్చారు. నెటిజన్లు ఈ యాడ్‌ని చాలా ఇష్టపడి రకరకాల ఫన్నీ రియాక్షన్‌లు ఇస్తున్నారు.
ఒక వినియోగదారు, ‘నా, మీ దేశంలో ఏదైనా సాధ్యమే’ అని వ్రాశారు, మరొక ఇది ‘యాడ్-ఘోస్ట్’ అని వ్యాఖ్యానించగా, ‘ముద్రించేవాడు గొప్పవాడు, ప్రకటించ ఇచ్చిన వాడు కూడా గొప్పవాడు’ అని కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..