AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పెళ్లి విందులో అప్పడం లొల్లి.. ఏకంగా లక్షన్నర నష్టం

Viral: పెళ్లి విందులో అప్పడం లొల్లి.. ఏకంగా లక్షన్నర నష్టం

Phani CH
|

Updated on: Sep 20, 2022 | 8:17 PM

Share

వివాహం అనేది ఎంతో సంతోషంగా సరదాగా సాగే శుభకార్యం. బంధుమిత్రుల సరదా ఆటలతో ఎంతో సందడిగా ఉంటుంది. ఈ క్రమంలో చిన్నపాటి గొడవలు కూడా జరుగుతాయి.

వివాహం అనేది ఎంతో సంతోషంగా సరదాగా సాగే శుభకార్యం. బంధుమిత్రుల సరదా ఆటలతో ఎంతో సందడిగా ఉంటుంది. ఈ క్రమంలో చిన్నపాటి గొడవలు కూడా జరుగుతాయి. అసలు గొడవజరగని పెళ్లంటూ ఉండదేమో… ఎందుకంటే అదే పెద్ద హడావిడి పెళ్లిలో.. మర్యాదలు తక్కువయ్యాయనో, వంటలు బాగాలేవనో ఏదో కారణాన్ని వెతుక్కొని మరీ తగవులు పడుతుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో పంచుకున్నారు మన టెక్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా. ఎంతో స్పూర్తిదాయకమైన అంశాలను నెటిజన్లతో పంచుకునే ఆనంద్‌ మహీంద్రా ఈసారి నెటిజన్లకు మంచి వినోదాన్ని అందించారు ఈ వీడియోతో.. ఈ వీడియో ఓ పెళ్లి విందుకు సంబంధించింది. ఈ పెళ్లి విందులో అప్పడం వడ్డించ లేదని మగ పెళ్లివారు లక్షన్నర రూపాయల ఫర్నీచర్‌ విరుగగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. కేరళలో జరిగిన ఓ పెళ్లి విందులో వియ్యంకుల వారికి బంతిలో కూర్చోబెట్టి పప్పన్నం వడ్డించారు ఆడపెళ్లివారు. వరుడి ఫ్రెండ్స్‌కు విందులో వడ్డించిన అప్పడం తెగ నచ్చేసింది. దీంతో రెండో సారి అప్పడం వడ్డించవల్సిందిగా హుకుం జారీ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

RRR: కేంద్ర ప్రభుత్వ చేతుల్లో.. RRR ఆస్కార్ ఆశలు..

Mahesh Babu: స్టోరీ చెబితే మహేష్ ‘నో’ అన్నారు.. అలాంటి సినిమానే కావాలన్నారు..

Sonu Sood: న్యూడ్ వీడియోలపై హెచ్చరించిన సోనుసూద్..

మరీ ఇంత దారుణమా.. మేకప్ లేకపోతే సీత ఇలానా..

రోజా అమ్మాయి.. విక్రమ్‌ అబ్బాయి.. త్వరలో ??

Published on: Sep 20, 2022 08:17 PM