అయ్యయ్యో..స్కూటీని కంట్రోల్ చేయలేక ఆ యువతి చేసిన పనికి నవ్వాపుకోలేరు..

నేటి కుర్రకారుకు బైక్ లు, స్కూటీలంటే విపరీతమైన క్రేజ్ ఉంది. చిన్న చిన్న ప్రయాణాల కోసం కూడా చాలా మంది బైకులపై దూసుకుపోతారు. వీటి కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.

Phani CH

|

Sep 20, 2022 | 8:18 PM

నేటి కుర్రకారుకు బైక్ లు, స్కూటీలంటే విపరీతమైన క్రేజ్ ఉంది. చిన్న చిన్న ప్రయాణాల కోసం కూడా చాలా మంది బైకులపై దూసుకుపోతారు. వీటి కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ఇదిలా ఉంటే.. స్కూటీలు నడపడం అంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో మనందరికీ బాగా తెలుసు. తాజాగా ఓ యువతి స్కూటీని కంట్రోల్‌ చేయలేక ఆమె చేసిన పని నెట్టింట నవ్వులు పూయిస్తోంది. వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజీలో ఓ యువతి పెట్రోల్‌ బంక్‌కు వెళ్లి స్కూటీలో పెట్రోల్ కొట్టించుకుంటుంది. స్కూటీ వెనుక ఓ వ్యక్తి, అతనితో పాటు మరో యువతి నిలబడి ఉన్నారు. పెట్రోల్‌ నింపుకుంటున్న యువతి స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్తున్న సమయంలో వెనుక నిలబడ్డ యువతి ఒక్కసారిగా యక్స్‌లేటర్‌ను రైజ్‌ చేసింది. దాంతో ఆ స్కూటీ పెట్రోలు పోసే యువకుడిని ఢీకొట్టింది. అతను అదుపు తప్పి బంక్‌పై పడిపోయాడు. ఈ క్రమంలో ముందు పెట్రోలు పోయించుకున్న యువతి కూడా కంగారుపడి స్కూటీతో సహా కిందపడిపోయింది. ఈ వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది. వీడియోను చూసిన నెటిజన్లు తమదైనశైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: పెళ్లి విందులో అప్పడం లొల్లి.. ఏకంగా లక్షన్నర నష్టం

RRR: కేంద్ర ప్రభుత్వ చేతుల్లో.. RRR ఆస్కార్ ఆశలు..

Mahesh Babu: స్టోరీ చెబితే మహేష్ ‘నో’ అన్నారు.. అలాంటి సినిమానే కావాలన్నారు..

Sonu Sood: న్యూడ్ వీడియోలపై హెచ్చరించిన సోనుసూద్..

మరీ ఇంత దారుణమా.. మేకప్ లేకపోతే సీత ఇలానా..

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu