Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మపై కొడుకు ప్రేమ కొండంత.. కారుని కన్నతల్లికి కానుకగా ఇచ్చిన తనయుడు.. అందమైన వీడియో మీకోసం

విలాసవంతమైన కారులో డ్రైవింగ్ సీటుపై ఓ మహిళ కూర్చొని ఉండడాన్ని మీరు వైరల్ వీడియోలో చూడవచ్చు. కొడుకుతో మాట్లాడుతూ కారు నడుపుతోంది. ఆ సమయంలో ఆ మహిళ ఎంత సంతోషంగా ఉందో వీడియోలో చూడొచ్చు.

Viral Video: అమ్మపై కొడుకు ప్రేమ కొండంత.. కారుని కన్నతల్లికి కానుకగా ఇచ్చిన తనయుడు.. అందమైన వీడియో మీకోసం
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Sep 19, 2022 | 5:52 PM

Amazing Viral Video: తల్లి పిల్లలపై చూపించే ప్రేమ గురించి, కుటుంబం కోసం అమ్మ పడే తపన గురించి ఎంత చెప్పినా తక్కువే.. తమ పిల్లల అభివృద్ధి కోసం, ఉన్నతి కోసం అందమైన భవిష్యత్ కోసం నిరంతరం తపిస్తుంది… కలలు కంటూ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది అమ్మ. అటువంటి అమ్మ ప్రేమని త్యాగాన్ని గుర్తుపెట్టుకున్న పిల్లలు.. తల్లి సంతోషంగా ఉండేలా చూస్తారు. తమ తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడానికి వారి కోరికలు,  కలలన్నింటినీ నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఇలాంటి అందమైన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక కొడుకు తన విలాసవంతమైన కారు స్టీరింగ్‌ను తన తల్లి చేతిలో పెట్టాడు.  కారు నడుపుతున్న ఆ మహిళ ముఖంలో ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్వయంగా చూడాల్సిందే. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతోంది.  నెటిజన్లు ఈ  హార్ట్ టచింగ్ వైరల్ వీడియోను ఎంతగానో ఇష్టపడుతున్నారు.  ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది దీన్ని లైక్ చేసారు.

విలాసవంతమైన కారులో డ్రైవింగ్ సీటుపై ఓ మహిళ కూర్చొని ఉండడాన్ని మీరు వైరల్ వీడియోలో చూడవచ్చు. కొడుకుతో మాట్లాడుతూ కారు నడుపుతోంది. ఆ సమయంలో ఆ మహిళ ఎంత సంతోషంగా ఉందో వీడియోలో చూడొచ్చు. ఆమె చిరునవ్వు  నెటిజన్ల మనసును దోచుకుంది. మహిళ డ్రైవింగ్ చేస్తోన్న తీరు.. ఆమె డ్రైవింగ్ నాపుణ్యం చూస్తుంటే.. ఆమెకు కారు డ్రైవింగ్ లో మంచి అనుభవం ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ అందమైన వీడియోపై ఓ లుక్ వేయండి: 

ఈ తల్లీ కొడుకుల ప్రేమ ఎవరికైనా నచ్చుతుంది. కొడుకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ‘మా అమ్మ ఎక్స్‌యూవీ700 డ్రైవింగ్ చేస్తోంది’ అని క్యాప్షన్ పెట్టాడు. సాయికిరణ్_కోర్ అనే వినియోగదారు దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆగస్ట్ 21న అప్‌లోడ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు 18 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. సాయికిరణ్ తన ఇన్‌స్టా ప్రొఫైల్‌లో తరచుగా ఫన్నీ పోస్ట్‌లను షేర్ చేస్తుంటాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..