Video Viral: ఈ తండ్రి కష్టం ఎవరికీ రాకూడదు.. కళ్ల ముందే కుమారుడు మృత్యువాత.. విధి లేని పరిస్థితుల్లో..
ప్రపంచ దేశాల మధ్య వలసలు నిత్యకృత్యమే. తమ దేశంలో జీవించే పరిస్థితులు, ఉపాధి అవకాశాలు లేని సమయాల్లో ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఇలా వెళ్లే సమయంలో ఎన్నో రకాల ఆటుపోట్లు, ఇబ్బందులు..
ప్రపంచ దేశాల మధ్య వలసలు నిత్యకృత్యమే. తమ దేశంలో జీవించే పరిస్థితులు, ఉపాధి అవకాశాలు లేని సమయాల్లో ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఇలా వెళ్లే సమయంలో ఎన్నో రకాల ఆటుపోట్లు, ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతుంటాయి. వీటన్నింటిని ఎదుర్కొని ముందుకు సాగితేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఈ ప్రయాణంలో ఆహారం దొరకక, ఇబ్బందులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో. వీరిలో చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ఈ వీడియోల్లో కొన్ని చాలా ఎమోషనల్‌గా ఉంటే, మరికొన్ని హృదయాలను కదిలిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ట్విటర్‌లో వైరల్‌గా మారింది.ఈ వైరల్ క్లిప్‌లో ఒక వ్యక్తి తన కుమారుడి మృతదేహాన్ని పడవ నుంచి సముద్రం మధ్యలో విసిరేయడాన్ని చూడవచ్చు. ఈ వీడియో ఆవేదన కలిగిస్తున్నా ఆ సమయంలో ఆ తండ్రి పడే వేదనను మాటల్లో వర్ణించలేం.
సిరియా దేశానికి చెందిన కొందరు వ్యక్తులు తమ కుటుంబాలకో కలిసి అక్రమ మార్గంలో యూరప్‌కు వెళుతోంది. మార్గమధ్యంలో చిన్నారికి దాహం వేసింది. నీళ్లు కావాలని అడిగాడు. కానీ అతని దాహం తీర్చేందుకు వారి వద్ద నీరు లేదు. ఇలా దాహంతోనే ఆ చిన్నారి గుక్కపట్టి ఏడ్చాడు. చివరకి ప్రాణాలే కోల్పోయాడు. కళ్ల ముందే కుమారుడు చనిపోవడంతో ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. కొడుకు మృతదేహాన్ని గుడ్డలో చుట్టి సముద్రం మధ్యలో పడేశాడు.
أب سوري يكفن ابنه بثيابه بعد وفاته بسبب العطش، ويلقي به في الماء ، بعد نفاد الوقود والغذاء في قارب الهجرة الى اوروبا! pic.twitter.com/AbvYCtgcJ4
— عمر مدنيه (@Omar_Madaniah) September 18, 2022
వైరల్ అవుతున్న వీడియోలో పడవలో కూర్చున్న కొందరు వ్యక్తులు ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. కొంతమంది ‘అల్లా హు అక్బర్’ అనడంతో, తండ్రి కొడుకు మృతదేహాన్ని సముద్రంలో విసిరేశాడు. ఈ దృశ్యం హృదయ విదారకంగా ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి