Pakistan: పాక్ విమానంలో కిటికీలను పగలగొడుతూ ప్రయాణీకుడు బీభత్సం.. కాళ్లు, చేతులు కట్టేసి సీటుకి కట్టేసింది సిబ్బంది
యువకుడు వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఎయిర్‌లైన్స్ PK-283 ఫ్లైట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తోటి ప్రయాణీకులు కూడా ఆ యువకుడి దురుసు ప్రవర్తనకు విసుగుచెందారు.
Pakistan: పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) లో చోటు చేసుకున్న ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. పెషావర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో ఒక ప్రయాణికుడు నానా హంగామా చేశాడు. ఆ ప్రయాణికుడిని బ్లాక్ లిస్ట్ లో పెట్టే కఠిన నిర్ణయాన్ని ఎయిర్‌లైన్ సంస్థ తీసుకుంది. ARY న్యూస్ ప్రకారం.. పెషావర్-దుబాయ్ విమానంలో ఒక ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. కోపం వచ్చినప్పుడల్లా.. ఫ్లైట్ కిటికీల వద్దకు వెళ్లి కాలితో తన్నడం మొదలు పెట్టాడు. మరొకొన్ని సార్లు.. విమానంలోని సీట్లను తన్నడం మొదలుపెట్టాడు. అంతే కాదు తనను సముదాయిస్తున్న విమాన సిబ్బందితో ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించి వీరంగం సృష్టించాడు.
విమానంలోని సిబ్బందితో ప్రయాణికుడు గొడవపడటంతో ఈ మొత్తం ఘటన మొదలైంది. అనంతరం యువకుడు వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఎయిర్‌లైన్స్ PK-283 ఫ్లైట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తోటి ప్రయాణీకులు కూడా ఆ యువకుడి దురుసు ప్రవర్తనకు విసుగుచెందారు. విమానం కిటికీ అద్దాలను, సీట్లను కాలితో తన్నడంతో పాటు.. అకస్మాత్తుగా విమానం నేలపై పడుకున్నాడు. ఫ్లైట్‌లో ఉన్నంతసేపు అతడి వింత చేష్టలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫ్లైట్ అటెండెంట్ యువకుడి దురుసుతనాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించగా.. అతనిపై కూడా దాడికి పాల్పడ్డాడు.
వీడియోపై ఓ లుక్ వేయండి:
Passenger tries to break a cabin window of a #Pakistan International Airlines Airbus A320 bound from #Peshawar to #Dubai. pic.twitter.com/JNy6XjEAMS
— Yusra Askari (@YusraSAskari) September 19, 2022
ప్రయాణికుడిని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన విమానయాన సంస్థ:
ఆ వ్యక్తి చర్యల వలన ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు సిబ్బంది అతడి కాళ్ళు, చేతులు కట్టేసి.. అతడిని సీటుకు కట్టినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ప్రోటోకాల్ ప్రకారం.. విమాన కెప్టెన్ దుబాయ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను సంప్రదించి భద్రతను కోరాడు. విమానం దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన అనంతరం ఆ ప్రయాణికుడిని భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబరు 14న జరిగిన ఈ ఘటనపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రౌడీ ప్రయాణికుడిని ఎయిర్‌లైన్ సంస్థ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానంలో వింత సంఘటనలు జరుగుతూ ఉండడం విషయం. అంతకుముందు.. వేడితో బాధపడుతున్న ప్రయాణీకులు తమ చేతులతో పేపర్ ఫ్యాన్‌లను ఉపయోగిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ వీడియోలో ప్రయాణికులే కాదు, ఎయిర్ హోస్టెస్ కూడా ఫ్యాన్‌ను ఊపుతూ కనిపించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..