Pakisthan Floods: పాక్ లో వరద బీభత్సం.. హిందువుల దుస్థితిని వెలుగుకి తెచ్చిన జర్నలిస్టుని అరెస్ట్ చేసిన పాక్ పోలీసులు

పాక్ దేశంలో హిందూ మైనారిటీలపై పాకిస్తాన్ అధికారులు చేస్తున్న దురాగతాలను బహిర్గతం చేస్తూ కవరేజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నీరు, ఆహారం అందడంలేదని .. కనీసం ఆశ్రయం కూడా లేదంటూ బాధితులు వాపోతున్నారు

Pakisthan Floods: పాక్ లో వరద బీభత్సం.. హిందువుల దుస్థితిని వెలుగుకి తెచ్చిన జర్నలిస్టుని అరెస్ట్ చేసిన పాక్ పోలీసులు
Journalist Arrested In Pak
Follow us

|

Updated on: Sep 13, 2022 | 4:48 PM

Pakisthan Floods: పాకిస్థాన్‌లో ఎన్నడూ లేనంతగా వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సింధ్ ప్రావిన్స్‌లో కొనసాగుతున్న వరదల్లో చిక్కుకున్న పాకిస్థానీ హిందువుల కష్టాలపై రిపోర్టింగ్ చేసినందుకు పాకిస్థాన్ పోలీసులు ఒక జర్నలిస్టును అరెస్టు చేశారు. బాధిత ప్రజలు తరువాత విపత్తు నుండి బయటపడటానికి ప్రాథమిక వనరులను కోల్పోయారని పేర్కొన్నారు.. బాధితుల తాజా పరిస్థితిని స్థానిక మీడియా నివేదించింది. సింధ్‌లోని మిర్‌పూర్ మాథెలో భాగ్రీ వర్గానికి చెందిన పాకిస్థానీ హిందువుల కథనాన్ని కవర్ చేసినందుకు పాకిస్థాన్ పోలీసులు బుధవారం జర్నలిస్టు నస్రల్లా గడ్డానిని అరెస్టు చేశారు. జర్నలిస్టు నస్రల్లాను  5 రోజుల రిమాండ్‌కు తరలించారు. హిందువులైనందుకు భాగ్రీ కమ్యూనిటీ ప్రజలను వరద సహాయక శిబిరం నుండి స్థానిక అధికారులు బయటకు పంపారని జర్నలిస్ట్ పేర్కొన్నారు.

తమ దేశంలో మైనారిటీలు సురక్షితంగా ఉన్నారని..  సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారని తరచుగా పాక్ ప్రభుతం, అధికారులు ప్రకటిస్తుంటారని.. అయితే ప్రస్తుతం దేశంలో హిందూ మైనారిటీలపై పాకిస్తాన్ ప్రభుత్వం, అధికారులు చేస్తున్న దురాగతాలను బహిర్గతం చేస్తూ కవరేజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశంలో ఏర్పడిన విపత్తు ప్రభావం దాదాపు 33 మిలియన్ల మంది ప్రజలపై పడింది. నీరు, ఆహారం అందడంలేదని.. కనీసం ఆశ్రయం కూడా లేదంటూ బాధితులు వాపోతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో హిందూ భాగ్రీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు.. తమ దయనీయమైన దుస్థిని.. స్థానిక పరిపాలన అధికారులు వ్యవహరించిన తీరును వివరిస్తున్నారు. వరద బాధితులు కాదని స్థానిక యంత్రాంగం తమను వరద సహాయక శిబిరాల నుంచి బహిష్కరించిందన్నారని వాపోతున్నారు.

ఒక బాధితురాలు ఏడుస్తూ, “మమ్మల్ని హిందువులమైనందుకు బహిష్కరించారు. మాకు ఆహారం, నీళ్లు కూడా ఇవ్వడానికి నిరాకరించారు. మేము వరదల బాధితులం కాదని వారు భావిస్తున్నారు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి? మా పిల్లలు ఎలా బతకాలి?” “మేము నిరుపేదలం, వరదల కారణంగా మా ఇల్లు కోల్పోయాము. మేము వరద బాధితులం కాదని స్థానిక పరిపాలన చెబుతుంది. మాతో చిన్న పిల్లలు ఉన్నారని వాపోతుంది ఆ మహిళ.

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్‌లో తీవ్ర వివక్షతను ఎదుర్కొంటున్న హిందువుల దుస్థితి.. సింధ్ ప్రావిన్స్‌లో ఇటీవలి వరదల పరిస్థితితో మరింత దారుణంగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బలూచిస్తాన్‌లో ఇందుకు విరుద్ధంగా..  హిందూ సమాజం వరద బాధిత ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు దేవాలయం తలుపులు తెరిచి మానవత్వం చాటి చెప్పింది. మత సామరస్యాన్ని చాటింది.

దేశంలో దాదాపు 50 వేల కోట్ల రూపాయల మేర పశుసంపదను ప్రజలు కోల్పోయారని తెలిపారు.  UN నివేదిక ప్రకారం, సింధ్‌లో 1.2 మిలియన్ హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమి దెబ్బతింది, అయితే 1.5 మిలియన్లకు పైగా ఇళ్లు వరద నీటితో ధ్వంసమయ్యాయి. ఆకస్మిక వరదలు పాకిస్తాన్‌లోని 80 జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దేశంలో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య దాదాపు 1,200 కి చేరుకుంది. ఆదివారం గడిచిన 24 గంటల్లో మరో 12 మంది మరణించడంతో సింధ్‌లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 621కి చేరుకుంది.

మరిన్ని అంతర్జాయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..