Viral Video: సారే జహాసే అచ్చా సాంగ్ తో ఇండిపెండెన్స్ డే విషెష్ చెప్పిన సౌదీ సింగర్.. భారత్ తనకు రెండో ఇల్లు అంటూ..

2020లో మజీద్ మారంచెర్రీ దర్శకత్వం వహించిన కొండోట్టిపురం చిత్రం ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రధాన నటుడిగా అరంగేట్రం చేశాడు.  మాలీవుడ్ లో నటించిన మొదటి అరబ్ జాతీయుడుగా చరిత్ర సృష్టించాడు.

Viral Video: సారే జహాసే అచ్చా సాంగ్ తో ఇండిపెండెన్స్ డే విషెష్ చెప్పిన సౌదీ సింగర్.. భారత్ తనకు రెండో ఇల్లు అంటూ..
Saudi Singer Hashim Abbas
Follow us

|

Updated on: Aug 20, 2022 | 10:24 AM

Viral Video: భారతదేశం 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆగస్టు 15, 2022న జరుపుకున్న సందర్భంగా సౌదీ సింగర్ హషీమ్ అబ్బాస్ పాడిన సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమా పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత జాతీయ జెండాను పట్టుకుని ఏడారిలో చిత్రీకరించిన ఈ సాంగ్ భారతీయులను ఆకట్టుకుంది. భారత దేశం తనకు రెండో ఇల్లు అని చెప్పే ఈ సౌదీ సింగర్ హషీమ్ సౌదీలోని భారత ఐటీ కంపెనీలో హెచ్ఆర్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాడు.

ప్రముఖ ఈజిప్షియన్ గాయకుడు హిషామ్ అబ్బాస్‌ పేరుని తన పేరులో కొంత భాగంగా చేసుకున్నాడు హషీమ్ అబ్బాస్. 2020లో మజీద్ మారంచెర్రీ దర్శకత్వం వహించిన కొండోట్టిపురం చిత్రం ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రధాన నటుడిగా అరంగేట్రం చేశాడు.  మాలీవుడ్ లో నటించిన మొదటి అరబ్ జాతీయుడుగా చరిత్ర సృష్టించాడు. హషీమ్ అబ్బాస్ ఏడాదిన్నర క్రితం భారతదేశ జాతీయ గీతం “జన గణ మన”ని ఆలపించారు. ఆ వీడియో జనవరి 26, 2021, దేశ గణతంత్ర దినోత్సవం రోజున విడుదల చేశారు.

తాజాగా భారతదేశానికి స్వతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను చెబుతూ అబ్బాస్ ‘సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా’ని విడుదల చేశారు. హషీమ్ అబ్బాస్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. “నా రెండవ ఇల్లు భారతదేశానికి మరో గొప్ప బహుమతి” అని క్యాప్షన్ ఇచ్చారు. హషీమ్ తన వీడియోను “హ్యాపీ ఇండిపెండెన్స్ డే”,  “జై హింద్”తో ముగించాడు.

ఇవి కూడా చదవండి

సారే జహాన్ సే అచ్చా: సారే జహాన్ సే అచ్చా సాంగ్ ను అధికారికంగా “తరానా-ఇ-హిందీ” అని పిలుస్తారు. ఇది ఉర్దూ భాషా దేశభక్తి గీతం. దీనిని ప్రముఖ కవి అల్లామా ఇక్బాల్ (సర్ ముహమ్మద్ ఇక్బాల్) రచించారు. ఈ పాట అప్పట్లో గొప్ప ప్రజాదరణ పొందింది. సంక్షిప్త సంస్కరణ దేశభక్తి పాటగా, ముఖ్యంగా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత సాయుధ దళాల కవాతు పాటగా గుర్తింపును సొంతం చేసుకుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..