Viral Video: తనకు ఎదురైన రక్తపింజరను మింగిన తాచు పాము.. షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్
ఈ షాకింగ్ వీడియోలో రస్సెల్ వైపర్‌ను విడిచి పెట్టిన అనంతరం.. కోబ్రా పాము వెనక్కి వెళ్లిపోయినట్లు మీరు చూడవచ్చు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు స్థానిక పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేశారు.

Viral Video: పాము తన ఆహారం కోసం కప్పు, ఎలుక వంటి జీవులను మింగిన సందర్భాలను చూస్తూనే ఉంటాం. అయితే పాము మరో పాముని మింగిన సందర్భాలు బహు అరుదనే చెప్పవచ్చు. సర్వసాధారణంగా ఒక పాముకి .. మరొక జాతి పాము ఎదురైతే.. తమ దారిని మార్చుకుని వెళ్లిపోతాయని అంటారు. అంతేకాని.. తనకు ఎదురైన పాముని వేటాడే పాము చాలా అరుదుగా కనిపించే సంఘటన. ప్రస్తుతం సోషల్ మీడియాలో అటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక తాచు పాము మరొక జాతికి చెందిన పామును మింగినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ తింటున్నారు. ఈ ఘటనను అక్కడ ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ ఆశ్చర్యకరమైన ఘటన ఒడిశాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక కింగ్ కోబ్రా తనకు ఎదురుగా వచ్చిన రక్తపింజరి మింగడానికి ట్రై చేసింది. నోటిలో రక్తపింజరిని పట్టుకుని దాదాపు సగానికి మింగేసింది కూడా.. అయితే అనుకోని ట్విస్ట్ అప్పుడే జరిగింది. సగం మింగిన తర్వాత ఎదో గుర్తుకు వచ్చినట్లు.. రక్తపింజరిని తాను ఏ విధంగా మింగిందో.. తిరిగి అదే విధంగా విడిచిపెట్టింది. కింగ్ కోబ్రా నోటి నుంచి బయటపడిన రక్తపింజరి సజీవంగానే ఉంది.. ప్రపంచంలోని ప్రమాదకరమైన పాముల్లో ఒకటైన రక్తపింజని మింగిన తాచు పాము సజీవంగానే ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇక్కడ వీడియో చూడండి




ఈ షాకింగ్ వీడియోలో రస్సెల్ వైపర్‌ను విడిచి పెట్టిన అనంతరం.. కోబ్రా పాము వెనక్కి వెళ్లిపోయినట్లు మీరు చూడవచ్చు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు స్థానిక పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేశారు. అతను సంఘటన స్థలానికి చేరుకొని పాములను పట్టుకుని అడవిలోకి వదిలారు.
ఆగ్నేయాసియాలో కనిపించే కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. ఒక్కసారి కాటు వేస్తేనే భారీగా విషాన్ని చిమ్ముతుంది. . కింగ్ కోబ్రా కాటు నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఏనుగు కూడా కరిచిన వెంటనే చనిపోతుందంటే ఈకింగ్ కోబ్రా విషం పవర్ ఏమిటో ఊహించండి. అదే సమయంలో రక్తపింజర కూడా ప్రమాదకరమైన పాము. దీని విషం చాలా ప్రమాదకరమైనది. ఒక వ్యక్తిని కరిస్తే, కొద్దిసేపటికే ఆ వ్యక్తి రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. అవయవాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..