Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీ దృష్టి పవర్ కి పరీక్ష .. మంచు కొండల్లో దాగున్న పక్షి 5 సెకన్లలో పట్టుకోండి చూద్దాం..

చిత్రంలో మంచు దుప్పటి పరచుకున్నట్లు ఉంది. అంతేకాదు.. చెట్ల కొమ్మలు, రాతి శిలలతో ప్రకృతి సోయగం అద్భుతం అనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ చిత్రంలా మనసుని రంజిపజేస్తుంది. అయితే ఇందులో ఓ పక్షి కూర్చుని ఉంది.   

Optical Illusion: మీ దృష్టి పవర్ కి పరీక్ష .. మంచు కొండల్లో దాగున్న పక్షి 5 సెకన్లలో పట్టుకోండి చూద్దాం..
Optical Illusion
Follow us
Surya Kala

|

Updated on: Aug 21, 2022 | 10:13 AM

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్‌తో కూడిన చిత్రాలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. అవి చూడటానికి ఆసక్తి చూపే ఒక పజిల్ వంటి చిత్రాలు. ఒక్కసారి వాటిని చూడడం మొదలు పెట్టామా.. సవాలకు జవాబు తెలుసుకోవాల్సిందే. పరిశీలన శక్తితో పాటు.. మెదడుకి పవర్ పెరుగుతుంది. ఎందుకంటే మన కంటికి కనిపించే చిత్రంలో అనేక విచిత్రాలు దాచబడి ఉంటాయి. అవి సులభంగా కనిపించవు. దీని కోసం పదునైన దృష్టి.. గ్రాహ్యక శక్తి అవసరం. ఈ రోజు మేము మీ కోసం కొత్త బ్రెయిన్ టీజర్‌ని తీసుకువచ్చాము. తెల్లని అందమైన మంచు కొండల్లో ఒక పక్షి దాగి ఉంది. అది కనిపించదు. ఆ అందమైన చిన్న పక్షి ఎక్కడ దాక్కుందో 5 సెకన్లలో చెప్పగలరా?

ఆప్టికల్ ఇల్యూషన్ అంటే కంటిని మోసం చేయడం అని కూడా అంటారు. ఇది ఒక రకమైన భ్రమ. ఇది సాధారణ దృష్టి కంటే.. మరింత పరిశీలనతో సాధించాల్సి ఉంటుంది. చిత్రాలను పరిశీలించే సమయంలో మీ కళ్ళు, మీ మనస్సు రెండింటినీ ఉపయోగిస్తే, అప్పుడు పజిల్ చిటికెలో పరిష్కరించబడుతుంది. అయితే, కొన్ని ఆప్టికల్ భ్రమలు ఎంత సేపు చూసినా ఓ పట్టాన అర్ధం కావు. ఇప్పుడు కింద ఉన్న చిత్రంలోని భ్రమను తొలగించే ప్రయత్నం చేయండి. మంచు పొరల్లో తెల్లటి రంగు పక్షి దాక్కుని కూర్చుంది. అయితే మీరు దీన్ని వెదికి కనిపెట్టాలి. మరి ఆలస్యమేమిటి, చిత్రాన్ని జాగ్రత్తగా చూసి ఆ పక్షి ఎక్కడ ఉందో చెప్పండి?

ఆ పక్షినిచూశారా?  

ఇవి కూడా చదవండి
Optical Illusion

Optical Illusion

మెదడు టీజర్‌లతో కూడిన చిత్రాలు ఆసక్తిగా ఉంటాయి. దృష్టి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాదు మెదడుని పదునుగా చేస్తుంది. పై చిత్రాన్ని చూసి ఆ పక్షి ఎక్కడ ఉందో 5 సెకన్లలోపు చెప్పాలి. చిత్రంలో మంచు దుప్పటి పరచుకున్నట్లు ఉంది. అంతేకాదు.. చెట్ల కొమ్మలు, రాతి శిలలతో ప్రకృతి సోయగం అద్భుతం అనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ చిత్రంలా మనసుని రంజిపజేస్తుంది. అయితే ఇందులో ఓ పక్షి కూర్చుని ఉంది.   కనిపెట్టలేకపోతే.. కింద చిత్రాన్ని చూడండి.. సమాధానం టక్కున దొరుకుతుంది.

Optical Illusion 1

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..