Optical Illusion: అందమైన చిలుకలో దాగున్న అమ్మాయి.. 5 సెకన్లలో కనుక్కొంటే.. మీ పరిశీలన శక్తి సూపర్బ్..
సరికొత్త సవాల్ తో ఈరోజు ఆప్టికల్ ఇల్యూషన్స్ పిక్చర్ ను తీసుకొచ్చాము. మీరు మీ పరిశీలన నైపుణ్యాన్ని పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఆప్టికల్ ఇల్యూజన్ లో దాగున్న ఓ స్త్రీని 5 సెకన్లలో కనుగొనండి.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్స్ మన కళ్ళు, మనస్సును మోసగించే గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మనం చూసేదే నిజమని భావించేలా మనల్ని ఫూల్స్ చేసేలా ఇవి సృష్టించబడ్డాయి. ఆప్టికల్ భ్రమలను పరిశీలించే సమయంలో మనిషి మెదడులోని భాగాలు ఎలా పనిచేస్తాయో అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ఆప్టికల్ భ్రమలను ఉపయోగిస్తారు. ఇవి మనిషి మెదడు పనితీరు గురించి తెలియజేస్తుంది. ఆప్టికల్ భ్రమలు పరిశోధన విలువను జోడించడమే కాకుండా, వినోదానికి అద్భుతమైన మాధ్యమంగా నిలుస్తాయి. మీరు ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను సవాళ్ళను స్వీకరించి వాటిని పరిశీలించి .. నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలనుకుంటే.. సరికొత్త సవాల్ తో ఈరోజు ఆప్టికల్ ఇల్యూషన్స్ పిక్చర్ ను తీసుకొచ్చాము. మీరు మీ పరిశీలన నైపుణ్యాన్ని పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఆప్టికల్ ఇల్యూజన్ లో దాగున్న ఓ స్త్రీని 5 సెకన్లలో కనుగొనండి.
దిగువన ఉన్న ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని పరిశీలించండి
మీరు ఏమి గమనించారు?
ఇక్కడ ఉన్న ఈ చిత్రంలో ఒక చెట్టు మోడు మీద సంతోషంగా రంగురంగుల రామ చిలుక కూర్చుకుని ఉంది. ఈ చిత్రం వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ తన కెమెరాకు పని చెప్పి.. అందంగా తీసిన చిత్రంలా ఉంది. అయితే ఈ చిత్రంలో ఓ మహిళ దాగి ఉంది. మీరు ఆ స్త్రీని గుర్తించారా?.. మళ్ళీ చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి. మీరు ఈసారి రామచిలుక లో ఏదైనా వైవిధ్యాన్ని గమనించారా? సమయం కదులుతుంది. ఇప్పుడైనా స్త్రీని గుర్తించారా? సమాధానం ఇవ్వడానికి కొన్ని సెకన్లు మిగిలి ఉన్నాయి. మీలో కొందరు స్త్రీని గుర్తించి కనుక్కొని ఉండవచ్చు. అలా ఐదు సెకన్లలోపు చిలకలో దాగున్న స్త్రీని కనుక్కొంటే.. మీకు అద్భుతమైన పరిశీలన నైపుణ్యం ఉన్నట్లు లెక్క. అయితే చిలుకలో దాగి ఉన్న స్త్రీని ఇంకా కనుగొనలేని వారు, పరిష్కారం.. మేము చెప్పిన చిన్న చిట్కాలను పాటించి చూడండి.
ఈ చిత్రంలో దాగి ఉన్న స్త్రీ ఎక్కడ ఉందో అని ఆశ్చర్యపోతున్నారా.. ఈ చిత్రంలో ఎంత వెదికినా అందమైన రంగురంగుల చిలుక మాత్రమే కనిపిస్తుంది. ఇంకేమీ కనిపించడం లేదు కదా.. ఆప్టికల్ భ్రమకు సమాధానం చిలుకలోనే ఉంది. చిలుక వేషంలో దాక్కున్న స్త్రీయే చిలుక. ఈ చిత్రం మాజీ ప్రపంచ ఛాంపియన్ ఇటాలియన్ బాడీ పెయింటర్ జోహన్నెస్ స్టోటర్ మాస్టర్ క్రియేషన్స్‌లో ఒకటి. చిత్రంతో పెయింటర్ ప్రశంసలను పొందుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..