Optical Illusion: ఈ పిక్ లో దాగున్న పిల్లి, దుప్పి .. కనిపెడితే మీరు జీనియస్.. ఎందుకంటే 90 శాతం మంది ఫెయిల్

మీ మెదడు పనితీరుని అర్ధం చేసుకోండి అంటూ ఓ చిత్రం నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రం నాలో పిల్లి లేదా దుప్పి ఉంది.. వాటిని గుర్తించడానికి ప్రయత్నించండి అంటూ సవాల్ విసురుతోంది.

Optical Illusion: ఈ పిక్ లో దాగున్న పిల్లి, దుప్పి .. కనిపెడితే మీరు జీనియస్.. ఎందుకంటే 90 శాతం మంది ఫెయిల్
Optical Illusion
Follow us
Surya Kala

|

Updated on: Aug 12, 2022 | 10:59 AM

Optical Illusion: మెదడుకి పదును పెడుతూ.. సోషల్ మీడియాలో అనేక పజిల్స్, చిత్ర విచిత్రమైన బొమ్మలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ ఆప్టికల్ చిత్రం మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ వేదికగా హల్ చల్ చేస్తోంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ లో ఏమి దాగుందో ఆలోచించేలా చేస్తోంది. మరి ఈ చిత్రంలో దాగున్న జంతువులను కనిపెట్టి.. మీ మెదడు ఎలా పనిచేస్తుందో పరీక్షించుకోండి. ఇప్పుడు ఈ ఆప్టికల్ భ్రమను ప్రయత్నించండి.. మీ మెదడు పనితీరుని అర్ధం చేసుకోండి అంటూ ఓ చిత్రం నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రం నాలో పిల్లి లేదా దుప్పి ఉంది.. వాటిని గుర్తించడానికి ప్రయత్నించండి అంటూ సవాల్ విసురుతోంది.

అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ చిత్రంలో ఏ జంతువు లేదని అనిపిస్తుంది..మొదటి సారి చుస్తే.. కానీ మెదడుని, దృష్టిని లగ్నం చేసి.. అత్యంత శ్రద్దగా పరిశీలిస్తే.. ఆ బొమ్మలో ఎదో దాగుందని అనిపిస్తుంది. మీరు చిత్రాన్ని జూమ్ చేస్తే..  మచ్చలున్న జంతువు నిర్మాణం కని కనిపించకుండా అదృశ్యమవుతుంది. ఈ ఆప్టికల్ భ్రమలో రెండు జంతువులను గుర్తించవచ్చు.. అవి పిల్లి, దుప్పి. చిత్రాన్ని పరిశీలించిన తర్వాత కొంతమంది ఆన్‌లైన్ వినియోగదారులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పోస్ట్ లో పేర్కొన్న విధంగా మేము జంతువులను గమనించడానికి కూడా ప్రయత్నించాము. పిల్లిని కొంచెం ఈజీగా కనుగొన్నామని.. అయితే దుప్పి మాత్రం గుర్తించడం కష్టం అని చెప్పారు.

జంతువుల రూపాలను గుర్తించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే.. బొమ్మని కనీసం 40 సెం.మీ దూరం నుంచి చూడాలి.  అయితే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్ లో పిల్లి, దుప్పులను కనిపెట్టాలంటే.. ఇతర నెటిజన్లు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు.  తనకు “ఒక నిమిషం పట్టింది.. అయితే నేను పిల్లిని మాత్రమే గుర్తు పెట్టా అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. పెద్ద అడవి పిల్లిలా  కనిపిస్తున్న ఫ్రంటల్ ఫేస్ షాట్.” ఒకరు పేర్కొన్నారు.  “నాకు పిల్లి లేదా దుప్పి కనిపించడం లేదు.. అంటే దీనర్థం నా మెదడు ఏ విధంగా పనిచేయడం లేదా? అంటూ సందేహం వ్యక్తం చేశాడు. మరొకరు, “నేను కదిలే చిత్రాన్ని మాత్రమే చూస్తున్నాను.” పేర్కొన్నాడు.

మరి మీరు ఏ చిత్రాన్ని చూశారు? ఇది పిల్లి లేదా దుప్పి లేదా రెండూనా?

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..