AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusions: ఆకులో ఆకునై అంటూ దాక్కున్న గొల్లభామ.. మీ చూపుకి, ఏకాగ్రతకు పరీక్ష.. సాల్వ్ చేయండి చూద్దాం..

వైరల్ అవుతున్న ఆప్టికల్ చిత్రంలో ఆకుల మధ్య ఒక పురుగు దాగి ఉంది. మీరు చేయాల్సిందల్లా మీ మనస్సు ని లగ్నం చేసి.. ఆకులలో దాగి ఉన్న కీటకాన్నీ కనుగొనడమే. 

Optical Illusions: ఆకులో ఆకునై అంటూ దాక్కున్న గొల్లభామ.. మీ చూపుకి, ఏకాగ్రతకు పరీక్ష.. సాల్వ్ చేయండి చూద్దాం..
Optical Illusion
Surya Kala
|

Updated on: Jul 30, 2022 | 10:42 AM

Share

Optical Illusions: సోషల్ మీడియాలో, ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. వీటిని వయసుతో సంబంధం లేకుండా చాలా ఇష్టపడుతున్నారు. అయితే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు డిఫరెంట్. ఇవి చాలా గందరగోళంగా ఉంటాయి. అయితే ఈ చిత్రాలపై మీ మనస్సును లగ్నం ద్వారా.. మానసికంగా వ్యాయామం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో.. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ పిక్చర్ వైరల్ అవుతోంది.

అనేక ఆప్టికల్ భ్రమలు ఉన్నాయి. వీటిని 99 శాతం మంది ప్రజలు పరిష్కరించడంలో విఫలమయ్యారు. తెలివి తేటలు, ఏకాగ్రత ఉన్నవారు చిత్రాల్లోని ఆప్టికల్ భ్రమను పరిష్కరించగలుగుతారు. లేదంటే చిత్రంలో దాగున్న పక్షులు, జంతువులు, ఇతర జీవులను కనుకోవడంలో కష్టముగా భావిస్తారు. తలలు కొట్టుకోవడం, తలలు పట్టుకోవడం  ప్రారంభిస్తారు. ఈ రోజు మెదడుకు పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్‌ ఫోటోని తీసుకువచ్చాము. అందులో ఆకుల మధ్య ఒక పురుగు దాగి ఉంది. మీరు దానిని కనుగొని కనుగొనవలసి ఉంటుంది.

ఆకులలో దాక్కున్న పురుగు

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఆప్టికల్ చిత్రంలో ఆకుల మధ్య ఒక పురుగు దాగి ఉంది. మీరు చేయాల్సిందల్లా మీ మనస్సు ని లగ్నం చేసి.. ఆకులలో దాగి ఉన్న కీటకాన్నీ కనుగొనడమే.  ఇప్పుడు మీరు ఈ చిత్రాన్ని సాధారణంగా చూస్తే తోట మాత్రమే కనిపిస్తుంది. కనుగొనడం కష్టమైన పని. అయితే చిత్రంపై ద్రుష్టి సారించి.. ఏకాగ్రతగా చూస్తే ఇప్పుడు మీరు ఆకులో దాక్కున్న కీటకాన్ని కనుగొంటారు.

Optical Illusion 1

Optical Illusion 1

ఈ ఆప్టికల్ భ్రమకు సమాధానం:

మీరు కూడా కీటకం గొల్లభామను కనుగొనాలనుకుంటే, చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి.  ఆకులో ఆకునై అంటూ దాక్కున్న పురుగు కనిపించకపోతే.. ఈ సూచనని అనుసరించండి..   ఆకుల్లో కలిసిపోయేవిధంగా పురుగు కూడా ఆకు పచ్చరంగులోనే ఉంది.  మొదట ఆకుల మధ్యలో చూడాలి. ఇక్కడ మీకు ముదురు ఆకుపచ్చ రంగులో గొల్లభామ కనిపిస్తుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..