Optical Illusion: 1880 నాటి చిత్రం.. ఎలుగుబంటి ముఖంలో దాగున్న యజమాని ఫేస్.. 20 నిమిషాల్లో కనుక్కోగలరా.. ట్రై చేయండి..

ప్రస్తుతం వైరల్‌గా మారిన చిత్రంలో..  ఎలుగుబంటి లోపల దాగి ఉన్న దాని యజమానిని కనుగొనమని సవాల్ విసురుతోంది.  మీడియా నివేదికల ప్రకారం.. ఇది 1880 నాటి చిత్రం.

Optical Illusion: 1880 నాటి చిత్రం.. ఎలుగుబంటి ముఖంలో దాగున్న యజమాని ఫేస్.. 20 నిమిషాల్లో కనుక్కోగలరా.. ట్రై చేయండి..
Optical Illusion
Follow us

|

Updated on: Jul 27, 2022 | 1:23 PM

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్‌కి సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు వయసుతో సంబంధం లేకుండా ఆసక్తిగా చూస్తున్నారు. వాస్తవానికి ఆప్టికల్ భ్రమలు ఉన్న చిత్రాలు.. ‘మనసు ఆలోచనలు వేగవంతం చేస్తాయి. చిత్రాలలో ఎదో ఉందని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే.. ఈ ఫొటోల్లో లోతుల్లో మరొకొన్ని చిత్రాలు దాగి ఉంటాయి. వీటిని కనుగొనడానికి తమ దృష్టిని సారిస్తారు. మేధస్సుకు పదును పెడతారు. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో దాగిఉన్న ఇతర జంతువులను, వస్తువులను 99 శాతం మంది  కనుగొనలేరని పేర్కొన్నారు. ఎవరి దృష్టి సరిస్తారో.. ఏకాగ్రతతో లోతుగా చూడటానికి  ప్రయత్నిస్తారో..  వారు మాత్రమే చిత్రాల్లోని ‘రహస్యాన్ని’ పరిష్కరించగలరు.

అనేక రకాల ఆప్టికల్ భ్రమలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని చెప్పే చిత్రం కనిపిస్తే, ఆ చిత్రంలో దాగి ఉన్న వివిధ రకాల జంతువులను కనుగొనడం సవాలుగా మారుతుంది. ప్రస్తుతం వైరల్‌గా మారిన చిత్రంలో..  ఎలుగుబంటి లోపల దాగి ఉన్న దాని యజమానిని కనుగొనమని సవాల్ విసురుతోంది.  మీడియా నివేదికల ప్రకారం.. ఇది 1880 నాటి చిత్రం. ఈ పజిల్ మొదట పిల్లల కోసం రూపొందించబడింది. అయితే పిల్లలు, పెద్దలు కూడా చిత్రంలో దాచిన వ్యక్తిని కనుగొనడంలో ఆసక్తిని చూపిస్తున్నారు.

ఈ ఎలుగుబంటి చిత్రాన్ని గీసినట్లు తెలుస్తోంది. తల , మనిషి ముఖం మాత్రమే కలిగి ఉంది. తల లోపల మనిషి దాగి ఉన్నాడు. దీన్ని కనుగొనడం అంత సులభం కానప్పటికీ.. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, మీరు ఖచ్చితంగా ఈ ఛాలెంజ్‌ని పూర్తి చేస్తారు. ఎలుగుబంటి చిత్రంలో దాగిన మనిషి ముఖం దొరుకుతుంది.

ఇవి కూడా చదవండి

మీరు మనిషి ముఖం కనుకున్నారా.. మీరు ఎలుగుబంటి ముఖం లోపల దాగిన యజమాని ముఖాన్ని కనుగొన్నట్లయితే మంచిది. మీరు దానిని కనుగొనలేకపోతే మేము కొన్ని సూచనను ఇస్తున్నాం. ఈ చిట్కాలతో సమస్యను సాల్వ్ చేయడం సులభతరం అవుతుంది. మీరు ఎలుగుబంటి చెవుల క్రింద, చిత్రం మధ్యలో చూస్తే  మీరు ఖచ్చితంగా మనిషి ముఖం చూస్తారు.

Optical Illusion 1

Optical Illusion 1

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles