Viral Video: చిట్టి చెల్లెమ్మ నీకు నేనున్నానమ్మా.. చెల్లి కోసం ఈ అన్న ఏం చేశాడో చూస్తే ఫిదా కావాల్సిందే!
తండ్రి తర్వాత తండ్రంతటి వాడు అన్నయ్య. తన తమ్ముళ్ళను, చెల్లిళ్ళను కంటికి రెప్పలా చూసుకుంటుంటాడు. ముఖ్యంగా..
తండ్రి తర్వాత తండ్రంతటి వాడు అన్నయ్య. తన తమ్ముళ్ళను, చెల్లిళ్ళను కంటికి రెప్పలా చూసుకుంటుంటాడు. ముఖ్యంగా చెల్లిళ్ళకు అన్నయ్య ఓ రక్షకుడు లాంటివాడు అని చెప్పాలి. రోడ్డుపై పోకిరీల దగ్గర నుంచి.. ఇబ్బందుల వరకు ఏదీ కూడా దరికి చేరకుండా కాపాడుకుంటాడు. అలాంటి అన్నాచెల్లెళ్ళ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా ఫిదా అవ్వకమానరు.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ రోడ్డుపై ఎటు చూసినా వరద నీరు నిండి ఉండటం మీరు చూడవచ్చు. ఈ వరద నీటిని తన చెల్లి ఎలా దాటుతుందనుకున్నాడో ఏంటో.? ఆమెను నడిపించకుండా.. ఆ చిట్టి తల్లిని తన భుజాలపై ఎక్కించుకుని రోడ్డు దాటించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి లుక్కేయండి. కాగా, ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వరుసపెట్టి లైకులతో హోరెత్తిస్తున్నారు. ‘అన్నయ్య ప్రేమంటే ఇదే మరి’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..