- Telugu News Photo Gallery Cinema photos Vijay devarakonda HD stills from liger movie goes attractive in social media Telugu Movie stills
Liger Movie(HD Stills): కాఫీ విత్ కరణ్ షోలో తడబడ్డ విజయ్.. కరణ్ ప్రశ్నకు నీళ్లు నమిలిన రౌడీ హీరో..
Liger Movie: బాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు ఇప్పుడు లైగర్ (Liger) సినిమా గురించే చర్చ జరుగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై...
Updated on: Jul 27, 2022 | 5:24 PM

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా లైగర్.

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో కనిపించనున్నారు.

ఈ మూవీ ఆగస్ట్ 25న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రయూనిట్.

ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రముఖ రియాలిటీ షో కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేశారు.

ఇందులో భాగంగా విజయ్, అనన్యను తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు కరణ్.కరణ్ విజయ్‌ని నీకు చీజ్ ఇష్టమా ? అని కరణ్ అడిగారు.. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అంటూ సమాధానంగా విజయ్ చిరునవ్వు నవ్వారు.

అంతేకాదు కరణ్ తనదైన స్టైల్లో బోల్డ్ ప్రశ్నలతో విజయ్‌ని ఉక్కిరిబిక్కిరి చేశారు.

లాస్ట్ టైం సెక్స్ ఎప్పుడు చేశారు ? అని కరణ్ ప్రశ్నించగా.. నో.. ఈ క్వశ్చన్ రద్దు చేయండి అంటూ రిప్లై ఇచ్చారు విజయ్.

వీరిద్దరి మధ్యలో అనన్య మాట్లాడుతూ.. నేను ఊహించి చెప్పనా.. ఈరోజు ఉదయం విజయ్ వ్యాయమం చేశాడు అంటూ చెప్పేసారు.

ఈరోజు ఉదయమా అంటూ కొనసాగించారు కరణ్.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘ఫుల్ ఎపిసోడ్ కోసం వేయింటింగ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
