Viral: రోడ్డు పక్కన బిచ్చగాడికి కనిపించిన పాలిథిన్‌ సంచి.. ఏముందా అని విప్పి చూడగా.!

అది అహ్మదాబాద్‌లోని వస్నా ప్రాంతం. ఎప్పటిలానే జనాలతో రద్దీగా ఉంది. ఈలోపు ఓ బిచ్చగాడు చెత్త ఏరుకుంటూ అటుగా వచ్చాడు..

Viral: రోడ్డు పక్కన బిచ్చగాడికి కనిపించిన పాలిథిన్‌ సంచి.. ఏముందా అని విప్పి చూడగా.!
Polythene Cover
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 27, 2022 | 12:45 PM

అది అహ్మదాబాద్‌లోని వస్నా ప్రాంతం. ఎప్పటిలానే జనాలతో రద్దీగా ఉంది. ఈలోపు ఓ బిచ్చగాడు చెత్త ఏరుకుంటూ అటుగా వచ్చాడు. అతడికి అక్కడ ఓ నల్లటి పాలిథిన్ సంచి కనిపించింది. అందులో ఏముందా అని అతడు కుతుహులంగా దాన్ని విప్పి చూడగా.. దిమ్మతిరిగే షాక్ తగిలింది. లోపల తల, కాళ్ళు, చేతులు లేని మొండం కనిపించింది. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా హడలెత్తింది. రంగంలోకి దిగిన ఖాకీలు.. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టగా.. స్టన్నింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ కథేంటంటే.!

వివరాల్లోకి వెళ్తే.. స్థానిక వస్నా ప్రాంతంలో ఓ బిచ్చగాడికి నల్ల పాలిథిన్ సంచి ఒకటి కనిపించింది. అందులో తల, కాళ్ళు, చేతులు లేని మొండం కనిపించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. వారు స్పాట్‌కు చేరుకొని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ వెంటనే ఎంక్వయిరీ మొదలుపెట్టారు. కొన్ని క్లూస్ సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో వారికి స్కూటీపై వచ్చిన ఓ వృద్దుడు పాలిథిన్ సంచి పడేసినట్లు గుర్తించారు. విజువల్స్‌లో బండి నెంబర్ ప్లేట్ ఆధారంగా అతడి ఇంటి అడ్రెస్‌ను పోలీసులు కనిపెట్టారు. అంతేకాదు అతడి పేరు నీలేష్ జోషి అని తెలుసుకుంటారు.

అనంతరం నీలేష్ జోషి ఇంటికెళ్లిన పోలీసులకు రక్తం మరకలు కనిపిస్తాయి. అయితే నీలేష్ జోషి మాత్రం ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొబైల్ లొకేషన్ ఆధారంగా నీలేష్ జోషి రాజస్థాన్‌లో ఉన్నాడని తెలుసుకున్నారు. ఆ రాష్ట్ర పోలీసుల సాయంతో నీలేష్ జోషిని గుజరాత్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక అసలు నిజం కోసం తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టగా.. నీలేష్ తానే స్వయంగా తన కొడుకును హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

తన కొడుకు స్వయం జోషి ప్రతీరోజు మద్యం సేవించి ఇంటికొచ్చేవాడని.. తనతో ఎప్పుడూ గొడవపడేవాడని నీలేష్ విచారణలో వెల్లడించాడు. ఒకానొక సందర్భంలో తనపై చెయ్యి కూడా చేసుకున్నాడని చెప్పాడు. అతడి ప్రవర్తనకు విసుగు చెంది తానే హత్య చేసినట్లు నీలేష్ తెలిపాడు. మొదట పదునైన వస్తువుతో స్వయం జోషిని హత్య చేసి.. ఆ తర్వాత అతడి చేతులు, తల, కాళ్ళను శరీరం నుంచి నీలేష్ జోషి వేరు చేశాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..