AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: విమానం రోడ్డుపై ల్యాండ్ అవ్వడం ఎప్పుడైనా చూశారా?.. ఇదిగో వీడియో

అదో ప్రైవేట్ జెట్.. ఆకాశంలో విహరిస్తుండగా సడెన్‌గా ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. కానీ రన్‌వే ఎక్కడో ఉంది.. ఆ సమయంలో పైలట్ ఏం చేస్తాడు ఎలాగైనా రన్‌వేపైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు, కుదరకపోతే ప్లైట్‌ను వదిలేసి ప్యారాషూట్ ద్వారా దూకేస్తాడు. కానీ ఇక్కడో యువ పైలట్ మాత్రం ప్రాణాలకు తెగించి పెద్ద సాహసమే చేశాడు. నేరుగా ప్లైట్‌ను వాహనాలు వెళ్తున్న రోడ్డుపై సేఫ్‌గా ల్యాండ్ చేశారు. అది చూసిన వాహనదారులంతా అవాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: విమానం రోడ్డుపై ల్యాండ్ అవ్వడం ఎప్పుడైనా చూశారా?.. ఇదిగో వీడియో
Florida Pilot Safely Lands Cessna On Busy Road
Anand T
|

Updated on: Mar 11, 2026 | 5:38 PM

Share

ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో ఉన్న ఇండియన్‌టౌన్‌ రోడ్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న 19 ఏళ్ల నికో బ్రే అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి సెస్నా 150G విమానంలో సరదాగా ఆకాశంలో విహరించేందుకు వెళ్లాడు. అయితే వీళ్లు గాల్లో ఉండగానే సడెన్‌గా విమానం ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే ఫ్లైట్ ల్యాండ్ చేసేందుకు రన్‌వే దగ్గరకగా లేకపోవడంతో.. బ్రే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్లైట్‌ను రోడ్డుపైనే ల్యాండ్ చేయాలని అనుకున్నాడు.

అనుకున్నదే తడువుగా ప్రాణాలకు తెగించి ఫ్లైట్‌ను రోడ్డుపై సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. అది గమనించిన వాహనదారులు రోడ్డుపై విమానం ల్యాండ్ అవవ్వడం చూసి అవాక్కయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్లైట్‌లో ఉన్న బ్రే తో పాటు అతనికి స్నేహితుడికి గాని, రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులకు గాని ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఈ సాహసం చేసిన బ్రే 2025లోనే విమానాన్ని నాడిపేందుకు పైలట్ లైసెన్స్‌ పొందాడట, ప్రతస్తుతం అతను ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడట. అయితే మొదట్లో ఏ1ఏ రోడ్డులో ప్లైట్‌ను ల్యాండ్‌ చేయాలని అనుకున్నానని.. కానీ ఆ దారి చాలా ఇరుకుగా ఉందని.. అందుకే ఇండియన్‌టౌన్‌ రోడ్డులో విమానాన్ని ల్యాండ్ చేసినట్టు తెలిపాడు. అయితే విమానం రోడ్డుపై ల్యాండ్ అవుతున్న దృశ్యాలు స్థానిక వాహన దారులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!