Mughal Empire: మొఘలులు యుద్ధంలో ఓడిపోయి.. పారిపోయిన 10 యుద్ధాలు .. వారిని ఓడించిన యుద్ధ వీరుల గురించి మీకు తెలుసా..

అనేక యుద్ధాల్లో ఛత్రపతి శివాజీ , షేర్ షా, తాన్హాజీ, బాజీ రావ్ పేష్వా వంటి యోధుల ముందు మొఘలులు నిలబడలేకపోయారు. ఈ రాజుల నుంచి ఎదుర్కోలేక యుద్ధరంగం నుంచి పారిపోవాల్సి వచ్చింది.

Mughal Empire: మొఘలులు యుద్ధంలో ఓడిపోయి.. పారిపోయిన 10 యుద్ధాలు .. వారిని ఓడించిన యుద్ధ వీరుల గురించి మీకు తెలుసా..
Mughal Empire Lost These B
Follow us
Surya Kala

|

Updated on: Aug 06, 2022 | 5:04 PM

Mughal Empire: ఎన్నో యుద్ధాల గురించి పోరాడి ఓడిన రాజుల గురించి చరిత్ర చెబుతోంది. మనదేశాన్ని పాలించిన వారిలో మొఘల్ కు కూడా ఒకరు. మొఘలులకు శక్తివంతమైన పాలకులని.. మంచి పాలకులకి. శక్తివంతమైన సైన్యంతో దేశాన్ని పాలించారని చరిత్ర చెబుతుంది. అయితే మొఘలులను యుద్ధ సమయంలో ఎదిరింది.. పోరాడి.. కదనరంగం నుంచి పారిపోయేటట్లు చేశారు కొందరు రాజులు. అనేక యుద్ధాల్లో ఛత్రపతి శివాజీ , షేర్ షా, తాన్హాజీ, బాజీ రావ్ పేష్వా వంటి యోధుల ముందు మొఘలులు నిలబడలేకపోయారు. ఈ రాజుల నుంచి ఎదుర్కోలేక యుద్ధరంగం నుంచి పారిపోవాల్సి వచ్చింది. సాధారణంగా చరిత్ర;లో ఓడిపోయిన వారి యుద్ధాలు తక్కువ, వారి విజయాలు ఎక్కువగా ప్రస్తావించారు.  అయితే ఈ రోజు మనం మొఘలులు ఓడిపోయిన 10 యుద్ధాల గురించి తెలుసుకుందాం.

1) చౌసా యుద్ధం:

మొఘల్ సైన్యం చౌసా యుద్ధంలో ఓడిపోవడమే కాదు.. మొఘలుల చక్రవర్తి హుమాయున్ తన ప్రావిన్సులను వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఈ యుద్ధం జూన్ 26, 1539న చౌసాలో హుమాయున్ , ఆఫ్ఘన్ జనరల్ షేర్ షా సూరి మధ్య జరిగింది. ఈ యుద్ధం సుర్ సామ్రాజ్య స్థాపనకు దారితీసింది.  మొఘలులకు ఇది ఘోర పరాజయం. షేర్ షాకు భోజ్‌పూర్‌లోని ఉజ్జయినియా రాజపుత్రులు మద్దతు ఇచ్చారు. మొఘల్ సైన్యం ఓటమి తరువాత, హుమాయున్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి యుద్ధభూమి నుండి పారిపోయాడు. విజయం సాధించిన షేర్ షా తనకు తాను ఫరీద్ అల్-దిన్ షేర్ షా అనే బిరుదును ప్రదానం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

2) కన్నౌజ్ యుద్ధం: హుమాయున్ తన ఇద్దరు సోదరులు అస్కారీ మీర్జా , హిందాల్ మీర్జాతో కలిసి మే 17, 1540న కన్నౌజ్ యుద్ధంలో మరోసారి షేర్ షాతో తలపడ్డాడు. హుమాయూన్ విధాన లోపాలు, అతని  ఆయుధ సామాగ్రి వైఫల్యంతో మరోసారి ఓటమి పాలయ్యాడు. కన్నౌజ్ యుద్ధంలో షేర్ షా మొఘల్ సైన్యాన్ని రెండోసారి ఓడించాడు. హుమాయున్ .. తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం.. తన సోదరులతో కలిసి యుద్ధభూమిని విడిచిపెట్టాడు.

3)సఫావిడ్ యుద్ధం: 1622-1623 నాటి మొఘల్-సఫావిడ్ యుద్ధం ఆఫ్ఘనిస్తాన్‌లోని ముఖ్యమైన కాందహార్ కోట  కోసం సఫావిడ్ సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం మధ్య జరిగింది. ఇరాన్ పాలకుడు షా అబ్బాస్..  1595లో కాందహార్ ని కోల్పోయినప్పటి నుండి తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. 1621లో అతను తన సైన్యాన్ని నిషాపూర్‌లో సమీకరించమని ఆదేశించాడు. తరువాత అతను కూడా తన సైన్యంలో చేరాడు. కాందహార్ వైపు తన సైన్యాన్ని నడిపించాడు. మే 20 న కోటవద్దకు చేరుకుని కోట ముట్టడించాడు. జహంగీర్ కు ఈ దాడి గురించి తెలిసినప్పటికీ, చర్య తీసుకోవడంలో ఆలస్యం అయ్యాడు. 3,000 మంది సైనికులతో కూడిన చిన్న బృందం.. ఆయుధ సామాగ్రి లేకపోవడంతో ఎక్కువ కాలం యుద్ధం కొనసాగలేదు. 45 రోజుల పోరాటం తర్వాత యుద్ధంలో ఓడిపోయాడు.

4) ఉంబర్‌ఖైండ్ యుద్ధం: ఉంబర్‌ఖైండ్ యుద్ధం ఫిబ్రవరి 3, 1661న జరిగింది. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్..  మొఘల్ రాజుల మధ్య జరిగింది. మరాఠా సైన్యం.. మొఘల్  జనరల్ కర్తాలాబ్ ఖాన్ ఆధ్వర్యంలో పోరాటం జరిగింది. ఈ యుద్ధంలో మరాఠా సైన్యం మొఘల్ సైన్యాన్ని ఓడించారు.

5) సూరత్ యుద్ధం: సూరత్ యుద్ధం.. దీనిని సాక్ ఆఫ్ సూరత్ అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధం జనవరి 5, 1664న జరిగింది. గుజరాత్‌లోని సూరత్ నగరానికి సమీపంలో మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ..  మొఘల్ కెప్టెన్ ఇనాయత్ ఖాన్ మధ్య జరిగిన భూగర్భ యుద్ధం. మరాఠాలు మొఘల్ సైన్యాన్ని ఓడించి ఆరు రోజుల పాటు మొఘలుల ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. అపారమైన మొఘల్ సంపదతో కొన్ని వేలమందిని తన సైన్యంలో చేర్చుకొన్నాడు.

6) సింహగడ్ యుద్ధం సింహగడ్ యుద్ధం. దీనిని కొండనా యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధం ఫిబ్రవరి 4, 1670 రాత్రి సింహగడ్ కోట వద్ద జరిగింది. శివాజీ మొఘలుల నుండి తిరిగి తీసుకున్న మొదటి కోటలలో ఇది ఒకటి. రాత్రి చీకటిలో తాడు నిచ్చెనలతో గోడలు ఎక్కుతూ నిర్వహించారు. ఈ యుద్ధంలో మరాఠా జనరల్స్ ఉదయభాన్ రాథోడ్ , తాన్హాజీ వీరమరణం పొందారు, అయితే మరాఠాలు కోటను స్వాధీనం చేసుకున్నారు. ఈ పోరాటంలో తాన్హాజీ సాహసకృత్యాలు ఇప్పటికీ మరాఠీ కథలలో బాగా ప్రాచుర్యం పొందాయి.

7) సాల్హెర్ యుద్ధం ఫిబ్రవరి 1672లో మరాఠాలు.. మొఘల్ సామ్రాజ్యం మధ్య జరిగిన సాల్హెర్ యుద్ధం. మరాఠాలు మొఘలులను ఓడించిన మొదటి యుద్ధం కనుక ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

8) విక్రమ్‌ఘర్ యుద్ధం విక్రమగర్ యుద్ధం 1672లో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని విక్రమ్‌ఘర్ సమీపంలో జరిగింది. మరాఠా సామ్రాజ్యం , మొఘల్ సామ్రాజ్యం మధ్య జరిగింది. మరాఠాలకు యువరాజు శంభాజీ నాయకత్వం వహించగా, మొఘలులకు ఖిజర్ ఖాన్ నాయకత్వం వహించారు. మరాఠాలు మొఘల్ సైన్యాన్ని ఘోరంగా ఓడించి.. కొల్వాన్‌పై తమ పట్టును మరింత బలోపేతం చేసుకున్నారు.

9) జైత్పూర్ యుద్ధం జైత్‌పూర్ యుద్ధం.. మార్చి 1729లో బుందేల్‌ఖండ్ మరాఠా పాలకుడు ఛత్రసాల్ బుందేలా తరపున పీష్వా బాజీ రావు I ..  మొఘల్ సామ్రాజ్యం తరపున ముహమ్మద్ ఖాన్ బంగాష్ మధ్య జరిగింది. బంగాష్ డిసెంబర్ 1728లో బుందేల్‌ఖండ్‌పై దాడి చేశాడు. ఛత్రసాల్ కు పెరుగుతున్న వయస్సు ను, అతితక్కువ సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకుని సహాయం కోసం బాజీ రావును అభ్యర్థించాడు. బాజీ రావు నాయకత్వంలో మరాఠా-బుందేలా కూటమి జైత్‌పూర్‌లో బంగాష్‌ను ఓడించారు.

10) కర్నాల్ యుద్ధం ఫిబ్రవరి 24, 1739న కర్నాల్ యుద్ధం ప్రారంభమైంది.  ఇరాన్ అఫ్షరిద్ రాజవంశం స్థాపకుడు నాదర్ షా భారతదేశంపై దాడి  చేసే సమయంలో  నిర్ణయాత్మక యుద్ధంగా పరిగణిస్తారు. నాదర్ షా సైన్యం మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా సైన్యాన్ని మూడు గంటల్లోనే ఓడించింది. ఈ యుద్ధం నాదర్ షా సైనిక పదవీకాలంలో  విజయాలలో అత్యంత ముఖ్యమైన విజయంగా ఖ్యాతిగాంచారు. హర్యానాలోని కర్నాల్ సమీపంలో ఈ పోరాటం జరిగింది. (Source)

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రె వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!