AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Udai Singh: మాతృదేశం, రాజుని రక్షించడం కోసం ఏ తల్లి చేయని త్యాగం చేసిన ఆయా.. ఉదయ్ సింగ్, పన్నాదాయ్ గురించి తెలుసుకోండి..

చిన్న పిల్లాడైన రాణా ఉదయ్ సింగ్‌ను రక్షించడమే కాకుండా.. అతడిని రక్షించడం కోసం ఏ తల్లి చేయని గొప్ప త్యాగం చేసింది. అందుకనే పన్నాదాయ్ త్యాగం అనేక శతాబ్దాలపాటు చరిత్రలో గుర్తిండిపోయింది. 

Udai Singh: మాతృదేశం, రాజుని రక్షించడం కోసం ఏ తల్లి చేయని త్యాగం చేసిన ఆయా.. ఉదయ్ సింగ్, పన్నాదాయ్ గురించి తెలుసుకోండి..
Udai Singh Birth Anniversar
Surya Kala
|

Updated on: Aug 04, 2022 | 4:32 PM

Share

Udai Singh Birth Anniversary: మన దేశ చరిత్రలో అనేకమంది గొప్ప గొప్పరాజులున్నారు. తమ పరిపాలతో, పరాక్రమంతో చరిత్రలో ప్రసిద్ధిగాంచారు. మేవాడ్ కు చెందిన రాణా ఉదయ్ సింగ్ జయంతి నేడు. మేవాడ్ రాజవంశానికి చెందిన శక్తివంతమైన రాజుల్లో ఒకరైన ఉదయ్ సింగ్ పేరు గుర్తుకు వస్తే.. వెంటనే అతని పరాక్రమంతో పాటు, అతనిని రక్షించడం గురించి కథ కూడా జ్ఞాపకం వస్తుంది. ఉదయ్ సింగ్‌తో పాటు అతడిని పెంచిన ఆయా పన్నాదాయ్ పేరు కూడా ప్రస్తావిస్తారు. పన్నాదాయ్ లేకుంటే ఉదయ్ సింగ్ జీవించి ఉండేవాడు కాదు.. చరిత్రలో మహారాణా ప్రతాప్ లాంటి గొప్ప వీరుడు భారత దేశానికి లభించేవాడు కాదని చెబుతారు. వాస్తవానికి ఆయా పన్నాదాయ్.. చిన్న పిల్లాడైన రాణా ఉదయ్ సింగ్‌ను రక్షించడమే కాకుండా.. అతడిని రక్షించడం కోసం ఏ తల్లి చేయని గొప్ప త్యాగం చేసింది. అందుకనే పన్నాదాయ్ త్యాగం అనేక శతాబ్దాలపాటు చరిత్రలో గుర్తిండిపోయింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన.. ఆ త్యాగపు కథ గురించి ఈరోజు గుర్తు చేసుకుందాం. పన్నాదాయ్ ఎవరు.. ఉదయ్ సింగ్‌ను ఎలా రక్షించింది.. ఆమె చేసిన త్యాగం గురించి తెలుసుకుందాం..

పన్నాదాయ్ కథ ఏమిటి? మహారాణా సంగ్రాం సింగ్ పెద్ద కుమారుడు భోజరాజ్ శిరోమణి మీరాబాయిని వివాహం చేసుకున్నాడు. సంగ్రాం సింగ్ కి మహారాణి కర్ణావతి దంపతులకు కుమారు ఉదయ్ సింగ్. చిత్తోర్ లో జన్మించారు . ఆగస్టు 1522లో ఉదయ్ సింగ్ తండ్రి రాణా సంగ్రాం సింగ్ మరణించిన తరువాత అన్న రతన్ సింగ్ II పరిపాలన చేపట్టాడు. 1531లో రాణా రతన్ మరణించిన అనంతరం.. ఉదయ్ సింగ్ రెండో అన్న మహారాణా విక్రమాదిత్య సింగ్ రాజ్య పాలన చేపట్టాడు. విక్రమాదిత్యను బంధువు బంబిర్ చంపి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు చిన్నపిల్లవాడైన ఉదయ్ సింగ్ ను కూడా చంపడానికి ప్రయత్నించారు. ఉదయ్ సింగ్ ను పెంచుతున్న ఆయా పన్నాదాయ్ ఉదయ్ కు బదులుగా తన కొడుకు చందన్ ను బంబిర్ కు ఇచ్చింది. దీంతో ఉదయ్ సింగ్ స్థానంలో పన్నాదాయ్ కొడుకు చందన్‌ని బన్వీర్ హతమార్చాడు. పన్నాధయ్ తన త్యాగంతో తన కుమారుడిని బలి ఇస్తూ మాతృభూమిని తన రాజును రక్షించింది.

మహారాణా ప్రతాప్ జననం: ఉదయ్ సింగ్ ఉదయ్ సింగ్ మహారాణా సంగ చిన్న కుమారుడు. కుంభాల్‌ఘర్‌లో పాలికి చెందిన అఖైరాజ్ సొనగారా కుమార్తె జయవంతి దేవిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఈ దంపతులకు మహారాణా ప్రతాప్ కుంభాల్‌ఘర్‌లో జన్మించాడు. అదే సమయంలో, ఉదయ్ సింగ్ బన్వీర్‌ను ఓడించి చిత్తోర్‌ని పొందాడు. మేవార్ కొత్త మహారాణా అయ్యాడు. అప్పుడు మహారాణా ప్రతాప్ చాలాకాలం కుంభాల్‌ఘర్‌లో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

పన్నాదాయ్ ఎవరు? పన్నాదాయ్ తండ్రి హర్‌చంద్ జీ హంక్రా, అతను చిత్తోర్‌గఢ్ సమీపంలోని పండోలి గ్రామంలో జన్మించాడు. ఆమె భర్త కమేరి గ్రామానికి చెందిన చౌహాన్ గోత్రి లాలాజీ గుర్జర్ కుమారుడు సూరజ్మల్. పన్నాకు బాల్యంలోనే బలి అయిన చందన్ అనే ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. పన్నా మేవాడ్  రాష్ట్రానికి చెందిన యువరాజుని ఉదయ్ సింగ్‌ను రక్షించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..