AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Begging Raise Funds: గుడులు, బడులకు దానం చేసే బిచ్చగాడు.. ఇప్పటి వరకు భిక్షాటనతో రూ.50లక్షలకు పైగా విరాళం

జీవనోపాధి కోసం భిక్షాటన చేయగా వచ్చిన చిల్లర సొమ్మును వేలు గా కూడబెట్టి.. లక్షలుగా సీఎం సహాయనిధికి అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. దేవాలయాల నిర్మాణానికి, స్కూల్స్ రిపేర్ కు, శ్రీలంకలోని శరణార్ధులకు ఇలా ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో వివిధ జిల్లాల కలెక్టర్లకు రూ.55.60 లక్షలు విరాళాలు అందించాడు.

Begging Raise Funds: గుడులు, బడులకు దానం చేసే బిచ్చగాడు.. ఇప్పటి వరకు భిక్షాటనతో రూ.50లక్షలకు పైగా విరాళం
Beggar Donates Over 50 Lakh
Surya Kala
|

Updated on: Jul 27, 2022 | 10:05 AM

Share

Begging Raise Funds: దానం విశిష్టత గురించి మన సనాతన ధర్మంలో పేర్కొన్నారు. గుడులు, బడుల నిర్మాణం, అన్నదానం, విద్యాదానం వంటివి రాజులు, సంపన్నలు మాత్రమే చేస్తారు. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా దానం చేసే విషయంలో కూడా మార్పులు వచ్చాయి. మేము మనం నుంచి నేను నాది అనే స్టేజ్ కు చేరుకున్నాడు మనిషి.. దీంతో ఇప్పుడు ఎక్కువమంది.. ఎవరికైనా ఏమైనా పెట్టాలంటే.. మాకు ఏముంది.. అని అంటారు.. కానీ ఎదుటివారికి ఏదైనా పెట్టాలన్నా.. ఏదైనా మంచి చేయాలంటే.. ముందు కావాల్సింది డబ్బులు కాదు.. పెట్టె మనసు.. అది ఉంటె.. తనకు ఉన్నదానితో కొంచెమైనా ఎదుటివారికి ఇస్తారు.. ఈ విషయాన్నీ ఓ యాచకుడు నిరూపిస్తున్నాడు. తాను జీవనోపాధి కోసం భిక్షాటన చేయగా వచ్చిన చిల్లర సొమ్మును వేలు గా కూడబెట్టి.. లక్షలుగా సీఎం సహాయనిధికి అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. దేవాలయాల నిర్మాణానికి, స్కూల్స్ రిపేర్ కు, శ్రీలంకలోని శరణార్ధులకు ఇలా ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో వివిధ జిల్లాల కలెక్టర్లకు రూ.55.60 లక్షలు విరాళాలు అందించాడు. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని అలంకినారు గ్రామానికి చెందిన 72 ఏళ్ళ పూల్‌పాండి భిక్షగాడిగా జీవిస్తున్నాడు. ఇటీవల వేలూరు కలెక్టరేట్‌లో జరుగుతున్న గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చా డు. తన వద్ద ఉన్న 10 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలంటూ, శ్రీలంక తమిళులకు ఉపయోగపడేలా వాటిని ఖర్చు చేయాలని కోరుతూ కలెక్టర్‌ కుమరవేల్‌ పాండియన్‌కు అందజేశాడు. పుష్కరకాలంగా భిక్షాటన చేస్తూ వచ్చే డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొనుగోలు చేసి ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఇలా 50.60 లక్షలు విలువ చేసే వస్తువులు, సొమ్మును విరాళంగా పలు సందర్భాల్లో అందజేసాడు.

ఎం.పూల్‌ పాండియన్‌ వద్ద ఏముంటాయో తెలుసా.. ఒక బ్యాగ్‌.. అందులో టవల్, కావి ధోతి, టంబ్లర్, ప్లేట్. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పాండియన్ భిక్షాటన చేసి సంపాదించిన మొత్తాన్ని ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధికి విరాళంగా ఇచ్చాడు.  పాండియన్ తన సంపాదనను తూత్తుకుడి, తంజావూరు, పుదుకోట్టై జిల్లాల్లోని పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి చాలా సంవత్సరాలుగా విరాళంగా ఇస్తున్నారు. తమిళనాడు ప్రజలు ఉదార ​​స్వభావులు. తమ కళ్ల ముందు ఎవరూ ఆకలితో అలమటించకుండా చూసుకుంటారు. కొందరు డబ్బు విరాళంగా ఇస్తే, మరికొందరు తాను ఆకలితో ఉండకూడదని టీ , ఇడ్లీలు కొంటారు అని అతను చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..